ETV Bharat / state

ఈ నెల 28న తెలంగాణ మంత్రిమండలి భేటీ - CABINET_MEETING_O

ఈ నెల 28న తెలంగాణ మంత్రిమండలి సమావేశం నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ భేటిలో కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలకు ఆమోదంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి అన్ని శాఖలకు మంత్రి మండలి సమావేశంపై సమాచారం ఇచ్చారు. ఆయా శాఖలకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలు, పెండింగు అంశాలపై ఈ నెల 25లోగా వివరాలు ఇవ్వాలని సూచించారు.

ఈ నెల 28న తెలంగాణ మంత్రిమండలి భేటీ
author img

By

Published : May 7, 2019, 4:58 AM IST

Updated : May 7, 2019, 8:13 AM IST

ఈ నెల 28న తెలంగాణ మంత్రిమండలి భేటీ

శాఖల సమూల ప్రక్షాళనే లక్ష్యం...

పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి... ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 14తో పోలింగ్​ ముగియనుంది. మొత్తంగా అన్ని ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత మంత్రిమండలి భేటీ నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు. దీని కోసం అన్ని శాఖల నుంచి సమాచారం కోరారు. ఆయా శాఖల సమూల ప్రక్షాళనకు కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాల రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ చట్టాల ముసాయిదాలను ఈ నెల మూడో వారంలోగా పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే శాసనసభలో ప్రవేశపెట్టేందుకు వీలుగా బిల్లులను తయారు చేస్తారు. వాటిపై మంత్రిమండలిలో చర్చించి ఆమోదం తెలుపనున్నారు. పలు పాలనాపరమైన అంశాలకూ మంత్రిమండలి పచ్చజెండా ఊపనుంది.

శాసనసభ, మండలి సమావేశాలపైనా దృష్టి...

ఎన్నికల నియమావళి ముగుస్తున్నందున రైతుబంధు, ఆసరా, ఇతర పథకాల సాయం పెంపు వంటి వాటికి కూడా మంత్రిమండలి ఆమోదముద్ర వేసే అవకాశాలు ఉన్నాయి. జూన్‌ రెండో తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యోగాల భర్తీ, వివిధ నిర్మాణాలకు స్థలాల కేటాయింపు, ఇతర అంశాలపై కీలక నిర్ణయాలుంటాయని తెలుస్తోంది. రాష్ట్ర మంత్రిమండలి సమావేశానికి తేదీ ఖరారు కావడం వల్ల శాసనసభ, మండలి సమావేశాలపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ నెల 29 నుంచి 31 వరకు మూడురోజుల పాటు శాసనసభ, మండలి సమావేశాలు జరిపే వీలుంది.

కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలపై కీలక నిర్ణయం..

ఈ సమావేశాల్లో కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలపై చర్చించి ఆమోదం తీసుకోవాలని సీఎం నిర్ణయించారు. 28న మంత్రిమండలి ముసాయిదాను ఆమోదించిన వెంటనే 29 నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో ఈ రెండు చట్టాలపై చర్చించి ఆమోదం తీసుకుంటారు. ఆ తర్వాత వాటిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు.

ఇవీ చూడండి: పునరావాస ప్లాట్లు కొల్లగొడుతున్న కబ్జాదారులు

Intro:TG_KRN_07_06_ALPHORES_CBSE_AB_C5
సీబీఎస్ఈ పదవతరగతి ఫలితాలు మరోసారి ఆల్ ఫోర్స్ పాఠశాల అద్భుత ఫలితాలను సాధించింది ఐదువందల మార్కులకు గాను 482 మార్కులు 477 మార్కులు 475 మార్కులు అంతేకాకుండా 450 మార్కులు సాధించి తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఈ సందర్భంగా అద్భుతమైన మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ఫోర్స్ పాఠశాల కళాశాల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి పుష్పగుచ్ఛాలతో అభినందించారు తమ కృషికి చేయూతనిస్తూ ప్రతిసారి ముందంజలో నిలుస్తున్న తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు

బైట్ సురక్ష విద్యార్థిని
బైట్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్

Body:ఉడు

Conclusion:గ్
Last Updated : May 7, 2019, 8:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.