హుజురాబాద్ ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్(Etela Rajender Rally)... తెలంగాణ ఆత్మగౌరవ విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. శామీర్‌పేట్‌లోని తన నివాసం నుంచి గన్‌పార్క్ వరకు భారీ వాహణశ్రేణితో ర్యాలీగా బయల్దేరారు. అల్వాల్ వద్ద తెలంగాణ తల్లి, ఆచార్య జయశంకర్ విగ్రహాలకు నివాళులర్పించారు.
గన్‌పార్కు వరకు జరిగిన విజయోత్సవ ర్యాలీ అనంతరం ఈటల(Etela Rajender Rally), పార్టీ నేతలు బండి సంజయ్, వివేక్.. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. గన్‌పార్కు నుంచి నాంపల్లిలోని భాజపా కార్యాలయానికి ఈటల ర్యాలీ కొనసాగుతోంది. కాసేపట్లో ఆయన కార్యాలయానికి చేరుకోనున్నారు.
ఇదీ చదవండి: Komatireddy Venkat Reddy Comments: 'రేపటి నుంచి నా తడాఖా ఏంటో చూపిస్తా..' కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు