ETV Bharat / state

ఈమె ఆన్‌లైన్‌ బడిలో లక్షల మంది విద్యార్థులు - ఆన్‌లైన్‌ బడిలో లక్షల మంది విద్యార్థులు

కొవిడ్‌ ప్రభావంవల్ల చదువుల తీరూతెన్నూ ఊహించనంతగా మారిపోయింది. లాక్‌డౌన్‌లోనూ పాఠాలు చెప్పడానికి విద్యా సంస్థలు, శిక్షణ సంస్థలు రాత్రికి రాత్రే ఆన్‌లైన్‌ బాట పట్టాయి. కానీ దివ్యా లాల్‌ మాత్రం విద్యారంగంలో సాంకేతికత అవసరాన్ని దశాబ్దం కిందటే గుర్తించి అటుగా అడుగులు వేశారు. ఆమె ప్రారంభించిన ‘ఫ్లిప్‌లెర్న్‌’ లాక్‌డౌన్‌ సమయంలోనూ లక్షల మంది చదువులు కొనసాగించేలా చేస్తోంది.

ఈమె ఆన్‌లైన్‌ బడిలో లక్షల మంది విద్యార్థులు

author img

By

Published : Jul 6, 2020, 11:40 AM IST

దిల్లీ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో డిగ్రీ చేసిన దివ్య.. ఇరవై ఏళ్లుగా విద్యారంగంలో ఉన్నారు. దివ్య తల్లి డాక్టర్‌, తండ్రి సైంటిస్ట్‌. విద్య విలువ తెలిసినవాళ్లు కాబట్టి కుమార్తె ఆ రంగంలో అడుగుపెడతానంటే ప్రోత్సహించారు. మొదట ఎన్‌ఐఐటీలో కంప్యూటర్‌ పాఠాల్ని బోధించేవారు దివ్య. ఆ సమయంలో సాంకేతికతను ఉపయోగించి ‘స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌’ని తేవాలనుకున్నారు.

ఆ క్రమంలో ఎడ్యుకంప్‌, ఎడ్‌బిక్స్‌ లాంటి కంపెనీల్ని ప్రారంభించారు. మారుతున్న అవసరాల్ని గుర్తించి 2017లో ‘ఫ్లిప్‌లెర్న్‌’ను తీసుకొచ్చారు. తమ వెబ్‌సైట్‌ని ‘టీచింగ్‌ అండ్‌ లెర్నింగ్‌ పోర్టల్‌’ అని చెబుతారామె. అందుకు కారణం మార్కెట్‌లో ఉన్న చాలా సంస్థలకీ దీనికీ ఉన్న తేడానే. ‘ఫ్లిప్‌లెర్న్‌ద్వారా విద్యకూ, టెక్నాలజీ మధ్య ఉన్న గ్యాప్‌ని తగ్గిస్తున్నాం. మేం కేవలం విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలు చెప్పడమే కాదు, విద్యా సంస్థలకూ ఆన్‌లైన్‌ సేవలు అందిస్తున్నాం’ అని చెబుతారు దివ్య.

విద్యార్థుల కోసం...

విద్యార్థులకు పర్సనలైజ్డ్‌ లెర్నింగ్‌ని అందిస్తోంది ఫ్లిప్‌లెర్న్‌. ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈలతోపాటు అన్ని ప్రధాన రాష్ట్రాల బోర్డులకు సంబంధించి 12వ తరగతి వరకూ డిజిటల్‌ కంటెంట్‌ను ఇక్కడ పొందొచ్చు. ఫ్లిప్‌లెర్న్‌ యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా ఈ సేవల్ని వినియోగించుకోవచ్చు. పాఠాల్ని ఆకర్షణీయమైన గ్రాఫిక్‌లతో వీడియోలుగా రూపొందించి చెబుతారు వీటిలో. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి విద్యార్థి నేర్చుకుంటున్న తీరు, వేగాన్ని బట్టి సిలబస్‌ స్థాయిని మార్చుకుంటూ పాఠాలు బోధిస్తారు. విద్యార్థికి సంబంధించిన వివరాలతో ఒక రియల్‌టైమ్‌ డ్యాష్‌బోర్డ్‌ ఉంటుంది. పిల్లలు ఏ విధంగా నేర్చుకుంటున్నారో తెలుసుకోవడానికి టీచర్లు లేదంటే తల్లిదండ్రులు కూడా క్లాసు సమయంలో వేరే డివైస్‌ నుంచి లాగిన్‌ అయ్యే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. విద్యార్థులు ఒక తరగతి కోసం వీరి సేవల్ని పొందితే ఆ తరగతికి ముందు, తర్వాత తరగతుల సిలబస్‌లనీ ఉచితంగా చదువుకునే వెసులుబాటు కల్పిస్తారు. సందేహాలు తీర్చడానికి ఆన్‌లైన్‌ టీచర్‌ సదుపాయంతోపాటు, 24 గంటలు పనిచేసే కాల్‌ సెంటర్‌ ఉంది. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు ఫ్లిప్‌లెర్న్‌ సేవలు పొందుతున్నారు.

టీచర్ల శ్రమ తగ్గేలా...

ఆన్‌లైన్‌ చదువులకు ఎక్కువ స్కూళ్లు వెళ్లకపోవడానికి కారణం అందుకు తగిన ఏర్పాట్లు లేకపోవడం ఒకటైతే, టీచర్లలో నైపుణ్యాల కొరత మరొకటి. అందుకే టీచర్లకీ ఆన్‌లైన్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది ఫ్లిప్‌లెర్న్‌. సబ్జెక్టుతోపాటు బోధనలో సాంకేతికతను ఉపయోగించుకోవడం గురించి టీచర్లకి చెబుతారిందులో. టీచర్లు, స్కూల్‌ యాజమాన్యాలు ఈ సేవల్ని ఉపయోగించకోవచ్చు. పాఠశాలలు తమ విద్యార్థులకు ఈ ఆప్‌ద్వారా ప్రత్యేకంగా లైవ్‌ క్లాసులు చెప్పించుకోవచ్చు. విద్యారంగంలోని వ్యక్తులతో వెబినార్లనీ నిర్వహిస్తారు.

ఫ్లిప్‌లెర్న్‌ అందించే కంటెంట్‌కంటే కూడా ఉత్తమమైన కంటెంట్‌ ఉపాధ్యాయుల దగ్గర ఉంటే వారి వీడియోల్ని అప్‌లోడ్‌ చేయొచ్చు కూడా. బోధనేతర అంశాల్లో టీచర్లకు శ్రమలేకుండా సాంకేతికతను తెస్తున్నారు. ఆన్‌లైన్‌లోనే పరీక్షల నిర్వహణ, హోమ్‌వర్క్‌లు ఇవ్వడం, విద్యార్థుల ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌లను రూపొందించడం, మెటీరియల్‌ సిద్ధంగా ఉంచడం... మొదలైన సేవల్ని అందిస్తున్నారు. ఏదైనా స్కూల్‌ తమ అవసరాల్ని చెబితే పరిష్కారం చెప్పే సాంకేతికతను అందిస్తారు కూడా. వీరితో కలిసి వందల స్కూళ్లు పనిచేస్తున్నాయి.

‘బోధన... చెప్పడం-నేర్చుకోవడం ఇలా రెండు వైపులనుంచీ జరిగే ప్రక్రియ. ఏ టెక్నాలజీ కూడా టీచర్ల స్థానాన్ని భర్తీ చేయలేదు. ఇవన్నీ వారి పనిని సులభతరం చేయడానికే. బోధనలో టెక్నాలజీ పాత్ర పెరిగినా కూడా విద్యార్థుల సందేహాల్ని నివృత్తి చేసేది టీచర్లే. వారే చదువునీ, టెక్నాలజీని బ్యాలెన్స్‌ చేసేది. టీచర్లు తమ మిగులు సమయాన్ని విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణానికి ఉపయోగించుకోవాలి. జీవన నైపుణ్యాల్ని నేర్పడంతోపాటు డిస్కషన్లూ, డిబేట్‌లూ, ప్రాక్టికల్స్‌కి ఉపయోగించుకోవచ్చు. విద్యార్థి ఆల్‌రౌండ్‌ డెవలప్‌మెంట్‌ టీచర్‌, స్కూల్‌ ద్వారానే జరుగుతుంది’ అని చెబుతారు దివ్య.

ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.