How to Relax on Weekend Telugu : వీకెండ్ అంటేనే అందరికి ఒకరకమైన సంతోషం. ఎలా గడపాలి.. అన్నదానిపై ఆలోచిస్తూనే ఉంటారు. కానీ ఆడవాళ్లుకు మాత్రం శ్రమే. గృహిణులైతే ఏం కొత్త వంటకాలు చేయాలా అనే విషయంలో బిజీ అయిపోతుంటారు. ఉద్యోగినులైతే దొరికిందే సమయం అనుకుని ఇంటి శుభ్రత, ఇతర పనులతో సరిపెట్టుకుంటారు. మరీ వారాంతాల్లో(Weekend Plans) కూడా ఇంటి పనులతో బిజీగా ఉంటే మనసు కుదుటపడేదేలా..? కొన్ని సమయాల్లో మనసుకు నచ్చిన పనిని కూడా పక్కన పెట్టేస్తాం దానికి కారణం ఒత్తిడి. ఇలాంటి వాటి నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలి అంటే..?
ఫోన్‌ను పక్కన పెట్టేయండి. కాసేపు ఏదైనా నచ్చిన పుస్తకాన్ని తీసుకొని ప్రశాంత వాతావరణంలో కూర్చొని హాయిగా చదవండి. పుస్తకం సమాచారాన్నే కాదు... తెలియని ప్రశాంతతని మనసుకు ఇస్తుంది.
Weekend Relaxation Tips in Telugu : మనం ఏదైనా చెప్పుకుందాం అనుకున్నప్పుడు నవ్వుతారు, వెక్కిరిస్తారు లేదా ఏమనుకుంటారోనని ప్రతిదాన్ని ఎవ్వరికి చెప్పకుండా మనసులో దాచేస్తుంటాం. ఇలా చేయడం వల్ల మనసుకి భారం పెరుగుతుంది. దీన్ని తగ్గించాలి అంటే పెన్ను తీసుకొని.. ఆలోచనలు, ఇబ్బందులు, ప్రణాళికలు, లక్ష్యాలు అన్నింటినీ ఒక పేపర్‌పై రాయండి. ఈ వారం ఎలా గడిచింది, సెలవు రోజు ఎలా గడపాలి అనుకుంటున్నారో కూడా మీరు రాయవచ్చు. మనసు భారం తగ్గడమే కాకుండా.. మీరు ఏం కోరుకుంటున్నారు.. ఏం చేయాలి అన్న మీకు ఒక స్పష్టత ఏర్పడుతుంది.
Singer Chithra Songs : ఒక్క ఛాన్స్‌తో 25వేల సాంగ్స్.. శ్వాస తీసుకోకుండా ఆ పాటతో మ్యాజిక్!
Gongadi Wool Shoes : 'గొంగడి'తో షూస్.. ఐడియా అదిరింది బాస్
కొంతమంది సెలవు దొరికితే చాలు అడుగు బయట పెట్టాలని కూడా ఆలోచించరు. దొరికిన ఆ కాసేపు సమయాన్ని అలా కూర్చుంటే చాలు అనుకుంటారు. నాలుగ్గోడల మధ్యే సమయాన్ని గడిపేస్తుంటారు. కానీ ఎంత సేపు అలా అని ఉంటారు..? సరదాగా పిల్లలను అలా బయటకు తీసుకొని వెళ్లండి. కొత్త ఆలోచనలు వస్తాయి. మనసుకు హాయిగా అనిపిస్తుంది. చెప్పుల్లేకుండా గడ్డి మీద నడవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఇంద్రియాల పనితీరు కూడా మెరుగుపడుతుంది.
ప్రతి మనిషికి ఏదైనా నచ్చిన అంశం ఉంటుంది. సమయం లేదనో, ఇంకో కారణం చేతో దాన్ని పక్కన పడేస్తాం. నచ్చింది చేయలేకపోవడం కూడా ఒత్తిడికి కారణం. వీలు కల్పించుకొని మీరు అనుకున్నది నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అది మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
జీతం లేని పని.. ఎంత చేసినా విలువుండదు అని మనకు మనమే చాలాసార్లు ఈ మాటను అనుకొని ఉంటాం.! కుదిరితే ఓ గంట అనాథాశ్రమంలోనో, వృద్ధాశ్రమంలోనో గడపడానికి ప్రయత్నించండి. డబ్బులు ఇవ్వాల్సిన పనేలేదు కదా. కాసేపు వాళ్లతో గడపండి.. కబుర్లు చెప్పిండి. అది మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
Vogue Italia : వోగ్ ఇటాలియాలో 'మనోళ్ల బొమ్మ'.. సరదాగా తీసిన ఫొటోకు గుర్తింపు