Jigarthanda : ఏప్రిల్ నుంచి ఎండలు దంచేస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు భగభగలతో భయపెడుతున్నాడు. ఎన్ని రకాల పానీయాలు తీసుకున్నా బాడీ డీహైడ్రేట్ అవుతూనే ఉంటోంది. ఇంకా ఈ కాలంలో పిల్లలు తొందరగా నీరసించిపోతుంటారు. తరచూ కూల్ డ్రింక్స్ తాగుతామని మారాం చేస్తుంటారు. కానీ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే శీతలపానీయాలు తాగకుండా శరీరాన్ని కూల్ చేసే ఓ సూపర్ డ్రింక్ ఉంది. అదే జిగర్తాండా. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మరి ఈ జిగర్తాండా అంటే ఏంటి..? దీని స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందామా..?
Jigarthanda prepare : వేసవిలో సాధారణంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చల్లదనం కోసం మజ్జిగనో, నిమ్మరసమో తాగుతారు. కానీ తమిళనాడు వాసులు మాత్రం ఈ జిగర్ తాండానే తాగాలి అంటున్నారు. ఇది మధురైలో దొరికే చల్లచల్లని డ్రింక్. ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలను తట్టుకోవాలంటే ఇది తప్పకుండా తాగాలి అంటున్నారు అక్కడి ప్రజలు. ఇది తాగటం వల్ల వచ్చే పోషకాలు చాలా ఆరోగ్య సమస్యలను దరిచేరనియవట.
జిగర్తాండాతో ఎన్ని లాభాలో: జిగర్ తండా తయారీలో వాడే ఆల్మండ్ గమ్ శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు దోహదపడుతుంది. నీరసాన్ని ఇట్టే పోగొట్టేస్తుంది. అజీర్తి వల్ల కడుపులో వచ్చే మంటను తగ్గిస్తుంది. దీన్ని సేవించడం వల్ల ఎలాంటి హాని లేనందున ఎలాంటి భయాలు లేకుండా పిల్లలకు కూడా ఇవ్వొచ్చు అంటున్నారు. మన దగ్గర నిమ్మసోడా, మజ్జిగా ఎలా బండ్లపైనా దొరుకుతాయో మధురైలో ప్రతి వీధిలో జిగర్తండా అలా దొరుకుతుందటా.
జిగర్ తాండ తయారికి కావల్సిన పదార్థాలు : బాదం పప్పు జిగురు (ఆల్మండ్ పిసిన్)- 3 చెంచాలు, కండెన్స్‌డ్ మిల్క్- 3 చెంచాలు, నన్నారీ సిరప్-3 చెంచాలు, పాలు- అరలీటరు, బటర్‌స్కాచ్ ఐస్‌క్రీం- కావాల్సినంత.
తయారీ విధానం : ఒక గిన్నెలో ఆల్మండ్ గమ్ వేసుకోవాలి. అందులో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి రాత్రంత ఉంచాలి. దీన్నీ హిందీలో గోంద్ అంటారు. అది నాని దాని పరిమాణం డబుల్ అయ్యి జెల్లీలా తయారవుతుంది. కొంచెం పెద్ద సైజు గిన్న తీసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో కండెన్స్‌డ్ మిల్క్, నన్నారీ సిరప్, పాలు వేసి కలపాలి. ఒక గ్లాసు తీసుకొని అందులో కాస్త ఆల్మండ్ గమ్ వేయ్యాలి. అందులో ముందుగా చేసి పెట్టుకున్న పాల మిశ్రమం పోసి బాగా కలుపుకోవాలి. దానిపై రెండు చెంచాల ఐస్‌క్రీం వేసుకోవాలి. కావాలంటే ఐస్‌క్రీం పైన నన్నారి సిరప్ చల్లుకొని డ్రైఫ్రూట్స్‌తో అలంకరించుకోవాలి అంతే చల్లని జిగర్ తండా రెడీ.
ఇవీ చదవండి: