How To Download Telangana Pattadar Passbook From Dharani : తెలంగాణ ప్రజానీకానికి ఆస్తి నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2020లో ధరణి పోర్టల్‌ను లాంచ్ చేసింది. ఆస్తి రిజిస్ట్రేషన్ల విధానాన్ని.. మొత్తం ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ మేరకు ఈ పోర్టల్‌ను తెచ్చింది. ఆస్తి రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా.. ల్యాండ్ మ్యూటేషన్, ల్యాండ్ రికార్డుల సెర్చ్, ఇతర భూ సంబంధిత సేవలకు ధరణి పోర్టల్ ఒక గమ్యస్థానంగా ఉంది. డిజిటల్‌గా ల్యాండ్ రికార్డులను తీసుకురావడంతో పారదర్శకత పెరిగింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఆఫీసులలో మోసాలు తగ్గాయి.
వ్యవసాయ, వ్యవసాయేతర ప్రాపర్టీలు రెండింటికీ ఈ ధరణి పోర్టల్ వర్క్ చేస్తుంది. ధరణి పోర్టల్ వచ్చిన తర్వత ల్యాండ్‌ల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ గంటల్లో జరిగిపోతున్నాయి. పాత ఓనర్ పాస్‌బుక్‌ను అప్ డేట్ చేసి, కొనుగోలుదారునికి కొత్త పాస్ బుక్ ఇస్తున్నారు. వ్యవసాయేతర భూములకు మెరూన్ రంగు పాస్ బుక్, వ్యవసాయ భూముకలు గ్రీన్ రంగు పాస్ బుక్‌లను జారీ చేస్తున్నారు. అంతకుముందు ల్యాండ్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ కోసం వారాల తరబడి సమయం పట్టేది. కాగా, ధరణి పోర్టల్ ద్వారానే.. పట్టాదారు పాస్‌బుక్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని మీకు తెలుసా? ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
తెలంగాణ పట్టాదార్ పాస్‌బుక్ అండ్ RoR-1B:
Telangana Pattadar Passbook & RoR-1B: పట్టాదార్ పాస్‌బుక్ అనేది తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ భూముల యజమానులందరికీ ఇవ్వబడిన ముఖ్యమైన పత్రం. పట్టా పాస్‌బుక్‌లో భూమికి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. అవి ఏంటంటే..
- భూమి యజమాని పేరు
- చిరునామా
- ఆధార్
- కులం
- భూమి సర్వే నెంబర్
- భూమి
- ఎకరాల్లో భూ విస్తీర్ణం
- ఖాతా నెంబర్
How To Download Pattadar Passbook: అయితే ధరణి పోర్టల్ నుంచి పట్టాదారు పాస్‌బుక్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. అవి ఏంటంటే..
మొదటిది.. పట్టాదారు పాస్‌బుక్ నెంబర్‌తో డౌన్లోడ్, రెండోది.. సర్వే నెంబర్‌తో డౌన్లోడ్ చేసుకోవడం..
పట్టాదారు పాస్‌బుక్ నెంబర్‌తో డౌన్లోడ్ చేసుకోవడం ఎలా..?
How to Download Passbook With Pattadar Number:
- ముందుగా ధరణి పోర్టల్ అధికారిక వెబ్సైట్ https://dharani.telangana.gov.in ను ఓపెన్ చేయాలి.
- స్క్రీన్ మీద ఉన్న Agriculture ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
- ఆ తర్వాత (IM 1)Land Detail Search ను ఎంపిక చేసుకోవాలి..
- ఆ తర్వాత Click Here to Continue పై క్లిక్ చేయాలి
- పట్టాదారు పాస్‌బుక్ నెంబర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి
- ఆ తర్వాత మీ పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ ఎంటర్ చేసి.. అనంతరం Captcha ఎంటర్ చేసి.. Fetch బటన్‌పై క్లిక్ చేయాలి
- స్క్రీన్‌పై మీ పాస్‌బుక్ వస్తది.. అనంతరం దానిని డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి..
ఇక మరో పద్ధతి..
How to Download Passbook With Survey Number:
- ముందుగా ధరణి పోర్టల్ అధికారిక వెబ్సైట్ https://dharani.telangana.gov.in ను ఓపెన్ చేయాలి.
- స్క్రీన్ మీద ఉన్న Agriculture ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
- ఇప్పుడు ఓపెన్ అయిన పేజీలో (IM 1)Land Detail Search ను ఎంపిక చేసుకోవాలి..
- ఆ తర్వాత Click Here to Continue పై క్లిక్ చేయాలి
- అనంతరం సర్వే నెంబర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి..
- తర్వాత మీ జిల్లా, మండలం, గ్రామం, సర్వే నెంబర్ ఎంటర్ చేసి.. Captcha ఎంటర్ చేసిన అనంతరం.. Fetch ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్‌పై మీ పాస్‌బుక్ వస్తది. అనంతరం దానిని డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి..
How to Download EC From Dharani Portal : ధరణి పోర్టల్ నుంచి.. ఈసీని డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఈజీ..