How to Check Voter ID Status in Telangana: తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే.. మీరు ఇప్పటికే ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే, మీ ఓటరు IDని ఇలా ట్రాక్ చేయవచ్చు. అలాగే.. మీ ఓటరు ID కార్డ్ రెడీ అయిన తర్వాత మీకు ఎప్పుడు చేరుతుందో కూడా తెలుసుకోవచ్చు. అది ఎలానో ఇక్కడ తెలుసుకుందాం..
ఓటర్ ఐడీ స్టేటస్ చెక్ చేయడానికి ఏం కావాలంటే..
What Are the Documents to Check Voter ID Status:
మీ ఓటర్ కార్డ్ అప్లికేషన్ స్థితిని తనిఖీ చేయడానికి అవసరమైన కొన్ని వివరాలు కావాలి. దరఖాస్తు సమయంలో మీకు ఓటర్ కార్డ్ అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ లేదా రసీదు సంఖ్య ఇస్తారు. ఇది అవసరం. అలాగే.. మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ లేదా ఇ-మెయిల్ ID అవసరం ఉంటుంది.
ఆన్లైన్లో ఓటర్ ఐడీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..
How to Check Voter ID Status Online:
- అధికారిక వెబ్‌సైట్ NVSPని సంప్రదించాలి
- అక్కడ కనిపించే National Voter's Service Portal లింక్‌పై క్లిక్ చేయాలి.
- మరో పేజీలో ఎడమ వైపున FORMS.. కుడివైపున SERVICES అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
- SERVICES సెక్షన్లో TRACK Application Status అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ Reference Number ఎంటర్ చేసి, STATE సెలెక్ట్ చేసుకోవాలి.
- అనంతరం.. 'ట్రాక్ స్టేటస్' బటన్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ ఓటర్ కార్డ్ అప్లికేషన్ ప్రస్తుత స్థితి స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇది మీ అప్లికేషన్ ప్రాసెస్ చేయబడిందా.. ఆమోదించబడిందా లేదా ఏవైనా అదనపు దశలు అవసరమా అని సూచిస్తుంది.
మీ ఓటర్ ID అప్లికేషన్ స్టేటస్ ఆఫ్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి?..
How to Check Voter ID Status Offline:
- మీ నియోజకవర్గానికి సమీపంలోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ERO)ని సందర్శించండి. ERO సంప్రదింపు వివరాలను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
- EROకి మీ పేరు, చిరునామా, అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ లేదా రసీదు సంఖ్య వంటి అవసరమైన వివరాలను అందించండి.
- మీ ఓటర్ కార్డ్ అప్లికేషన్ స్థితిని తనిఖీ చేయడంలో ERO మీకు సహాయం చేస్తుంది.
ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం.. ఓటు కోసం అప్లై చేసుకున్న 10 నుంచి 1 నెల రోజుల లోపు ఓటరు గుర్తింపు కార్డు అందుతుంది.
How EVM Machine Works Know A to Z Details : ఈవీఎం ఎలా పనిచేస్తుంది..? A to Z వివరాలు మీకోసం!