ETV Bharat / state

ఎస్​ఎస్​సీ గ్రేడింగ్​ కేటాయింపు ప్రక్రియ షురూ!

పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. ఎఫ్ఏ పరీక్షల్లోని మార్కులను ఐదింతలు చేసి గ్రేడ్లు ఇచ్చేందుకు అవసరమైన ప్రక్రియను ఎస్ఎస్​సీ బోర్డు ప్రారంభించింది. ఈ ఏడాది ఎక్కువ మంది విద్యార్థులకు టెన్ జీపీఏ రానుంది.

TS 10th Internal Marks 2020 grading
ఎస్​ఎస్​సీ గ్రేడింగ్​ కేటాయింపు ప్రక్రియ షురూ..!
author img

By

Published : Jun 11, 2020, 8:39 PM IST

పదో తరగతి ఫలితాలను ఈనెల 20 వరకు ప్రకటించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులందరినీ పాస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి జీవో జారీ చేసిన నేపథ్యంలో...అంతర్గత మదింపు పరీక్షల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇంటర్నల్ అసెస్ మెంట్ పరీక్షల ఆధారంగా గ్రేడ్లు నిర్ధరించాలని... ఎస్ఎస్​సీ బోర్డుగా వ్యవహరించే ప్రభుత్వ పరీక్షల విభాగాన్ని సర్కారు ఆదేశించింది.

గ్రేడ్ల లెక్కింపు ఇలా..

నాలుగు ఎఫ్ఏ పరీక్షల ఆధారంగా 20శాతం మార్కులను పాఠశాలలు మార్చి నెలలోనే బోర్డుకు ఆన్​లైన్​లో పంపించాయి. గతంలో ఫెయిలై ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్ష రాయాలనుకున్న విద్యార్థుల మార్కులు కూడా గతంలోనే బోర్డుకు చేరాయి. ఎఫ్ఏ మార్కులతో వాటిని విద్యా శాఖ అధికారులు పరిశీలించి నిర్ధారించారు. కాబట్టి ఇప్పటికే బోర్డు వద్ద ఉన్న ఇంటర్నల్ మార్కులను ఐదింతలు చేసి.. వందకు లెక్కించి గ్రేడ్లు ఇస్తారు.

ఎక్కువ మందికి పది జీపీఏ

రాష్ట్రంలో సుమారు ఐదున్నర లక్షల మంది విద్యార్థుల్లో... దాదాపు అందరూ తొమ్మిది నుంచి పది జీపీఏ సాధిస్తారని అధికారులు అంటున్నారు. అత్యధిక శాతం విద్యార్థులకు పది జీపీఏ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ గ్రేడింగ్​ ప్రక్రియ పది రోజుల్లో పూర్తి చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈనెల చివరి వారంలో మెమోలను కూడా పాఠశాలలకు చేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్ష ఉండదు.

ఇవీ చూడండి: కూలీ పని చేసుకుంటున్న డిప్యూటీ ఎమ్మార్వో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.