ETV Bharat / state

బడుగులకు రాజ్యాధికారమే లక్ష్యం: బీసీ నేత జాజుల

హైదరాబాద్ బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో బీసీ, ఎంబీసీ, సంచార జాతుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తామని రాష్ట్ర బీసీ సంఘం స్పష్టం చేసింది.

బలహీనవర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తాం : బీసీ సంక్షేమ సంఘం
author img

By

Published : Sep 6, 2019, 11:19 PM IST

బలహీనవర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తాం : బీసీ సంక్షేమ సంఘం

దొర, పటేళ్ల పాలనకు ఘోరి కట్టి బడుగు బలహీనవర్గాలకు రాజ్యధికారమే లక్ష్యంగా కృషి చేస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 'రాష్ట్ర బడ్జెట్ - బీసీల వాటా' అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీలకు పాలకులు చేస్తున్న అన్యాయాలను సమాజానికి చెప్పాలని అన్నారు. అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు బానిసలుగా మారిన బీసీలు మారాలని స్పష్టం చేశారు.

బడ్జెట్​లో 56 శాతం ఉన్న బీసీలకు 3 శాతం నిధులు కేటాయిస్తే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రానున్న బడ్జెట్​లో బీసీలకు 20 వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. కులవృత్తులు అంతరించిపోతున్నందున ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాలని అన్నారు. రాజకీయ నాయకుల జేబులు నింపడానికి, రియల్​ ఎస్టేట్ నాయకుల భూములకు నీళ్లు అందించేందుకే కాళేశ్వరం నిర్మించారని ఆరోపించారు. బీసీల రాజకీయ పార్టీ ఏర్పడినప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు టూ లెట్ బోర్డులు పడుతాయని జోస్యం చెప్పారు. బీసీల జనాభా ప్రాతిపదికన రాజ్యాంగబద్ధంగా బీసీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రగతి భవన్, మంత్రుల కాన్వాయ్​లను, అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని వెల్లడించారు. బీసీలను చిన్నచూపు చూస్తే 2023లో తెరాస వీఆర్ఎస్ తీసుకోక తప్పదని హెచ్చరించారు.

ఇవీ చూడండి : నిజామాబాద్​లో రచ్చరచ్చ.. తెరాస, భాజపా పోటాపోటీ నినాదాలు

Intro:Body:

VYAS

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.