ETV Bharat / state

వయసు 70 దాటినవారికి పడకలు గగనమే

వృద్ధులపై కరోనా విజృంభిస్తోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన ఊపిరితిత్తులపై తీవ్రప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో మహా నగరంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు వృద్ధులకు అధికంగా ఆక్సిజన్‌ అవసరముంటుందన్న ఉద్దేశంతో పడకలను కేటాయించడానికి నిరాకరిస్తున్నాయి.

hospital-beds-are-plentiful-for-those-over-70-years-of-age
వయస్సు 70 దాటినవారికి పడకలు గగనమే
author img

By

Published : May 8, 2021, 10:43 AM IST

  • ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన 72 ఏళ్ల వ్యక్తి కరోనా బారినపడ్డారు. మొదటి వారం కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆక్సిజన్‌ స్థాయి 80 శాతానికి పడిపోయింది. ఇప్పుడాయనకు రోజుకు 60 లీటర్లకు పైగా ఆక్సిజన్‌ అవసరమని అంచనా వేశారు. ఇంత పెద్దఎత్తున ఇవ్వాల్సి రావడంతో చాలా ఆస్పత్రులు పడక ఇవ్వడానికి నిరాకరించాయి. చివరికి ఆ పెద్దాయన టిమ్స్‌లో చేరాల్సి వచ్చింది.
  • మోతీనగర్‌కు చెందిన 78 ఏళ్లు వృద్ధుడు పది రోజుల కిందట కరోనా బారినపడ్డాడు. ఆక్సిజన్‌ స్థాయి తగ్గడంతో అతని కుమారులు ఇంట్లోనే అందిస్తున్నారు. తరువాత ప్రాణ వాయువు స్థాయిల్లో హెచ్చు తగ్గులు రావడంతో వెంటనే ఆస్పత్రులను సంప్రదించారు. వయస్సు అధికంగా ఉందన్న కారణంతో పడక ఇచ్చేందుకు నాలుగైదు ఆస్పత్రులు నిరాకరించాయి.

తక్షణం ప్రాణవాయువు అందించాల్సిందే..

హైదరాబాద్‌లో గత ఏడాది 70 ఏళ్లు.. ఆపై వయసు వృద్ధుల్లో కరోనా బారినపడిన వారి సంఖ్య కేవలం రెండు శాతమే. రెండో దశలో ఎనిమిది నుంచి పది శాతం మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారు అయిదారు రోజులు వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే ఊపిరితిత్తులపై వైరస్‌ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గంటల వ్యవధిలోనే రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు 90 శాతం నుంచి మొదలై ఒక్కసారిగా 75 శాతానికి పడిపోతున్నాయి. సంబంధిత రోగికి తక్షణం ప్రాణ వాయువు అందించాల్సి ఉంది. ఆక్సిజన్‌ స్థాయి మరీ దిగజారితే వెంటిలేటర్‌పై పెట్టాల్సిందే. సాధారణంగా తగ్గిన స్థాయిలను బట్టి కరోనా రోగులకు గంటకు నాలుగు లీటర్ల నుంచి ఆపై పెంచుకుంటూపోతారు. కొందరికి 60 లీటర్లు.. అంతకు మించి కూడా ఇవ్వాల్సి వస్తోంది.

ఆస్పత్రులు ముందుకు రావడం లేదు..

పేరొందిన కార్పొరేట్‌ ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సరఫరా బాగానే ఉంది. వీటిలో రోగుల స్థితిని బట్టి పడకలను కేటాయిస్తున్నారు. మధ్య తరగతి ఆస్పత్రుల్లో మాత్రం నెల రోజులుగా ఆక్సిజన్‌ నిల్వలు, సరఫరా దాదాపు సగానికి తగ్గిపోయాయి. సిలిండర్లలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ తెప్పించుకుంటున్నారు. చాలా కంపెనీలు సగానికి సగం కోటానే పంపిస్తున్నాయి. దీంతో ఉన్న నిల్వలను పొదుపుగా వాడుకోవాలని ఆయా ఆస్పత్రులు నిర్ణయించాయి. ఈ క్రమంలోనే, అధికంగా ఆక్సిజన్‌ అవసరమైన వారిని చేర్చుకోవడానికి ఆయా ఆస్పత్రులు ముందుకు రావడం లేదు. పడక కావాలని వెళితే ముందుగా ఆధార్‌ కార్డు అడుగుతున్నాయి.. అందులో వయస్సు 70పైన ఉంటే.. తమ వద్ద ఆక్సిజన్‌ పడకలు లేవని చెప్పేస్తున్నారు. 60 ఏళ్లు దాటినవారికి కూడా కొన్ని ఆస్పత్రులు పడకలను ఇవ్వడం లేదు. ఫలితంగా వృద్ధులు ప్రభుత్వ ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. అక్కడ పడక ఉంటే వెంటనే ఇస్తున్నారు.

ఇదీ చూడండి: టూత్‌ బ్రష్‌లూ కరోనా కారకాలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.