ETV Bharat / state

Horticulture in TS: రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు.. బిందుసేద్యంతో సాంకేతిక పరిజ్ఞానం - ఆయిల్‌ పామ్

Horticulture in TS: రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టును గరిష్ఠ స్థాయిలో వినియోగిస్తూ... పంటల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచేందుకు ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతోంది. వ్యవసాయ ఖర్చులను అన్ని రకాలుగా తగ్గించి, అధిక ఉత్పత్తితో సన్న, చిన్నకారు రైతుల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఉద్యాన శాఖను ప్రోత్సహిస్తూ... బిందు, తుంపర సేద్యం వైపు రైతులను మళ్లిస్తోంది. మరోవైపు సంప్రదాయ సాగుకు పత్యామ్నాయంగా కూరగాయలు, ఆయిల్‌ పామ్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

Horticulture Flagship Programme:
రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు
author img

By

Published : Jun 13, 2022, 3:39 PM IST

Horticulture in TS: తెలంగాణను ఆధునిక వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలను అమలుచేస్తున్న రాష్ట్ర సర్కార్ మెరుగైన సాగు నీటి యాజమాన్య పద్ధతులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే అందజేస్తున్న స్మూక్ష సేద్య పరికరాలతో సన్నకారు, మధ్య తరగతి రైతులు పెద్దఎత్తున లబ్ధి పొందుతోన్నారు. మైక్రో ఇరిగేషన్ ప్రోగ్రాంలో భాగంగా సూక్ష్మ సేద్య పరికరాలు, యూనిట్లకు పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తోంది. 2014-15 నుంచి 2021-22 వరకు రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల 42వేల 253 ఎకరాల్లో బిందు సేద్యం సాంకేతిక పరిజ్ఞానం, 2లక్షల 36 వేల 589 ఎకరాల్లో తుంపర సేద్యం పరిజ్ఞానంతో కలిపి మొత్తం 7లక్షల 78 వేల 832 ఎకరాల్లో సూక్ష్మ సేద్య పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ఇటీవల నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం, డ్రిప్, స్ప్రింక్లర్ యూనిట్ల ద్వారా 2లక్షల 91వేల 486 మంది రైతులు లబ్ధి పొందుతుండగా... మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి మొత్తం 19లక్షల 78 వేల ఎకరాల విస్తీర్ణం తెచ్చినట్లైంది.

మైక్రో ఇరిగేషన్ పరికరాల ఏర్పాటు గతంతో పోల్చితే 43 శాతం... అంటే 25.54 టీఎంసీల నీరు ఆదా అయింది. విద్యుత్ వినియోగం 1,703 లక్షల యూనిట్లతో 33 శాతం తగ్గింది. విద్యుత్ పొదుపుతో 76కోట్ల 67 లక్షల రూపాయలు మిగిలగా ఆయా రకాల పంటల సాగులో ఉత్పాదకతతో పాటు 52.30 శాతం ఉత్పత్తి పెరిగింది. ఈ పెరిగిన దిగుబడి 65 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా సగటున టన్నుకు 3వేల 171 రూపాయల చొప్పున లెక్కిస్తే రైతులకు 2వేల 49 కోట్లు అదనపు ఆదాయం లభించింది. రైతులకు కూలీ ఖర్చులు 94 కోట్ల రూపాయలు మిగిలాయని ఉద్యానశాఖ పురోగతిపై సర్కారు విడుదలచేసిన తాజా నివేదికలో వెల్లడైంది.

ష్ట్రంలో ఉద్యాన పంటల సాగు.. బిందుసేద్యంతో సాంకేతిక పరిజ్ఞానం

తెలంగాణ పసుపు పంట సాగు, విస్తీర్ణం, ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానంలో నిలువగా మిరప సాగు, విస్తీర్ణం, ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. ఆయిల్‌పాం సాగు విస్తీర్ణంలో ఆరో స్థానం, ఉత్పత్తిలోరెండో స్థానంలో నిలిచింది. వాతావరణం, భూసార పరిస్థితులు, మెరుగైన యాజమాన్య పద్ధతులు వల్ల గెలల నుంచి వస్తున్న ఆయిల్‌పాం నిష్పత్తి దేశంలో అత్యధికంగా 19.22 శాతం ఉంది. రాష్ట్ర సాగు విస్తీర్ణంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 5.39 శాతం మాత్రమే ఉన్నప్పటికీ మొత్తం వ్యవసాయ రంగానికి 27 శాతం జీవీఏ జమ చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.