ETV Bharat / state

సాయం చేసిన పోలీసులను అభినందించిన హోంమంత్రి

హైదరాబాద్​లోని చాంద్రాయణగుట్ట పోలీస్​ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి వర్షంలో మూడు రోజులుగా తడుస్తూ ఉన్నాడు. అది గమనించిన పోలీసు సిబ్బంది అతనిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ వారిని అభినందించారు.

author img

By

Published : Jul 16, 2020, 9:38 PM IST

Home Minister md ali congratulates chandrayangutta police for assistance
సాయం చేసిన పోలీసులను అభినందించిన హోంమంత్రి

మూడు రోజులుగా వర్షంలో తడుస్తున్న ఓ వ్యక్తిని కాపాడిన పోలీసు సిబ్బందిని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రశంసించారు. చాంద్రాయణగుట్ట పోలీస్​ స్టేషన్ పరిధిలో గత మూడు రోజులుగా వానలో తడుస్తూ ఓ దుకాణం వద్ద కూర్చున్న ఓ వ్యక్తి వద్దకు పోలీసు సిబ్బంది వెళ్లారు. తన వివరాలు ఏమీ చెప్పలేని పరిస్థితులు ఉన్న అతనిని కానిస్టేబుల్ మహేష్, హోం గార్డు ఎండీ సయీద్ రక్షించారు.

108 వాహనానికి సమాచారం ఇచ్చి.. అతనిని ఆ వాహనం ద్వారా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించినందుకు మహమూద్ అలీ వారికి అభినందనలు తెలిపారు. పోలీసు సిబ్బంది శాంతిభద్రతలు కాపాడడంతోపాటు ఇలా సేవ చేయడం మంచి పద్ధతి అని హోంమంత్రి చెప్పారు.

ఇదీ చూడండి : పాఠశాలల పునఃప్రారంభం, విద్యాబోధనపై సీఎం కేసీఆర్ కీలక సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.