పుట్టినరోజు నాడు అనాథ విద్యార్థులను కలవడం సంతోషంగా ఉందని రాష్ట్ర హోమంత్రి మహమూద్ అలీ అన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ అంబర్పేట్లోని అంజుమన్ ఖాదీముల్ ముస్లీమీన్ సంస్థలో ఉన్న విద్యార్థులను ఆయన కలిశారు. పిల్లల సంక్షేమం, దినచర్యల గురించి తెలుసుకున్నారు. కష్టపడి ఉన్నత విద్య చదివేలా కృషి చేయాలని వివరించారు. విద్యార్థులు హోంమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థులు తమ సందేహాలను ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని మంత్రి సూచించారు. సంస్థ పనితీరు గురించి అంజుమన్ ఖాదీముల్ ముస్లీమీన్ సంస్థ నిర్వాహకుడు బద్రుద్దీన్ హోంమంత్రికి వివరించారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తున్నారని తెలిపారు. వారి భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం సహకారం అందించాలని బద్రుద్దీన్ హోమంత్రిని అభ్యర్థించారు. దీనికి స్పందించిన మహమూద్ అలీ తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.