ETV Bharat / state

తెలంగాణ ఏర్పాటులో టీఎన్జీవోది కీలక పాత్ర: హోంమంత్రి - టీఎన్జీవోల డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన హోంమంత్రి

రాష్ట్ర ఏర్పాటులో టీఎన్జీవోలు కీలకపాత్ర పోషించారని హోంమంత్రి మహమూద్​ అలీ అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో టీఎన్జీవోల నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్​ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను సన్మానించారు.

tngos meeting in hyderabad nampally
టీఎన్డీవోల సభలో ఉద్యోగులకు అవార్డులు ప్రదానం
author img

By

Published : Jan 9, 2021, 11:01 PM IST

దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడంలో టీఎన్జీవోలు కీలకపాత్ర పోషిస్తున్నారని హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో కేసీఆర్​తో కలిసి పోరాటం చేశారని వారి సేవలను కొనియాడారు. హైదరాబాద్ నాంపల్లిలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ ఆధ్వర్యలో నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్​ను ఆయన ఆవిష్కరించారు.

ఉద్యోగుల సమస్యలను దశలవారీగా సీఎం నేరవేస్తున్నారని.. అన్ని వర్గాలను కలుపుకొని సమన్వయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుతున్నారని మంత్రి వెల్లడించారు. రైతుల కోసం 24 గంటల విద్యుత్ ఇవ్వడంతో పాటు రైతుబంధు, రైతు బీమా పథకాలు తీసుకువచ్చారని తెలిపారు. వివిధ రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 15 మంది ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ మసీఉల్లా ఖాన్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఆయాచితం శ్రీధర్, టీఎన్జీవో కేంద్ర సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : 'మిషన్​ భగీరథకు అభినందనలే కాదు నిధులూ ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.