హైదరాబాద్ కొండాపూర్లో హోలీ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. నగరంలోని చిన్నారులు రంగులు చల్లుకుంటూ ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆనంద కేరింతల మధ్య రంగోలి వేడుకలను రంగుల మయం చేశారు. కొద్దీ క్షణాల్లోనే రంగుల ఆటను ముగించారు.
కరోనా మహమ్మారి రెండో దశ విజృంభిస్తున్నందున పండుగల నిర్వహణపై ప్రభుత్వం ఆంక్షలు విధించినందున... చాలా వరకు ప్రజలు హోలీ సంబురాలు జరుపుకునేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. ప్రభుత్వ సూచనల మేరకు హోలీ వేడుకలకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నామని చిన్నారులు తెలిపారు.
ఇదీ చదవండి: లెబనాన్ వెళ్లి వస్తుండగా.. జైలుకు జగిత్యాల వాసి.!