India Car Racing League: భాగ్యనగరంలో అర్థాంతరంగా నిలిచిపోయిన ఇండియన్ రేసింగ్ లీగ్ యథావిధిగా నిర్వహిస్తామని హెచ్ఎండీఏ అధికారులు చెప్పారు. డిసెంబర్ 10,11 తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్-2 ఉంటుందని తెలిపారు. హుస్సేన్‌సాగర్ తీరంలో స్ట్రీట్ సర్క్యూట్‌లోనే ఐఆర్‌ఎల్ ఫైనల్ రేస్ ఉంటుందన్నారు. ఫిబ్రవరిలో జరిగే ఫార్ములా-ఇ నాటికి పురోగతి చేస్తామని హెచ్‌ఎండీఏ పేర్కొంది. ఫిబ్రవరి 11 న అసలైన ఫార్ములా -ఇ రేసింగ్ నిర్వహిస్తామని తెలిపింది.
ఫార్ములా-ఇ కోసం రెడీ చేస్తున్న ట్రాక్‌పైనే ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహణ ఉంటుందని వెల్లడించింది. స్వల్ప ప్రమాదాల వల్ల ఈ నెల 19, 20న నిర్వహించిన ఐఆర్‌ఎల్-1 రేసింగ్ నిలిచిపోయిందని తెలిపారు. ఇటీవల ఫార్ములా-4 రేస్ తోనే నిర్వాహకులు సరిపెట్టారు. ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రాక్టీస్‌తోనే నిర్వహకులు ముగించిన విషయం తెలిసిందే.
కొద్దిరోజుల క్రితం ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఫార్మూలా-ఈ పోటీలకు సన్నాహకంగా భావిస్తున్న జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్... ప్రధాన పోటీలు జరగకుండానే ముగిసింది. సమయాభావం, రేసర్లకు స్వల్ప ప్రమాదాల వల్ల అసలైన రేసును నిర్వాహకులు నిలిపివేశారు. దీంతో అసలైన తుది రేసింగ్ మజాను భాగ్యనగరవాసులు ఆస్వాదించలేకపోయారు. క్వాలిఫయింగ్ రేస్‌లో కొత్త ట్రాక్‌పై పలుమార్లు కార్లు ఢీకొని రేసర్లకు గాయాలయ్యాయి.
నాలుగు ఫార్ములా కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఇందులో ఒక రేసర్‌కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయాలకు తోడు చీకటి పడటం, రేసింగ్‌కు రెండ్రోజులు మాత్రమే అనుమతి ఉండటంతో సోమవారం నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇండియన్ రేసింగ్‌లోని మూడు ప్రధాన పోటీలు లేకుండానే సాధారణ పోటీలతోనే నిర్వాహకులు ముగించారు. ఇండియన్ రేసింగ్ లీగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ప్రధాన పోటీలు నిర్వహించకుండానే ట్రయల్ రన్‌తో నిర్వాహకులు సరిపెట్టారు. రేసర్లు ట్రాక్‌పై అలవాటు పడేందుకు ప్రధాన పోటీలు ఇలా చేశామని తెలిపారు. ప్రధాన ఈవెంట్లు ఇవాళైనా జరుగుతాయని భావించినప్పటికీ సాధ్యపడలేదు.
ఇవీ చదవండి: