ETV Bharat / state

HMDA చర్యలు.. హరితమయం దిశగా రహదారులు - HMDA Latest News

Hmda Greenary On National Highways: హైదరాబాద్​కు వచ్చే రోడ్లు ఆకుపచ్చ అందంతో స్వాగతం పలుకుతున్నాయి. నగరానికి వచ్చే అన్ని రహదారులపై హెచ్ఎండీఏ భారీగా గ్రీనరీని ఏర్పాటు చేస్తోంది. ఎండాకాలంలో కూడా పచ్చగా ఉన్న మొక్కలు.. నగరానికి వచ్చే వాహనాలను రా రామ్మంటు పిలుస్తున్నాయి. గత కొన్నేళ్లుగా హరితహారంలో భాగంగా హెచ్ఎండీఏ చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. వీటిని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు.. ఇతర రాష్ట్రాల అధికారులు వచ్చి స్టడీ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేసేందుకు వారు ముందుకొచ్చారు.

HMDA
HMDA
author img

By

Published : Mar 30, 2023, 9:35 PM IST

Hmda Greenary On National Highways: పచ్చదనం పరిమళాలు పట్టణాలకే పరిమితం కాకుండా జాతీయ రహదారుల వెంట విస్తరిస్తోంది. వేసవిలోనూ పచ్చదనంతో, పూలవనాలతో హైదరాబాద్​కు వచ్చే నేషనల్ హైవే మార్గాలు ప్రజానీకానికి కంటికి ఇంపుగా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. నగరానికి అనుసంధానంగా ఉన్న జాతీయ రహదారులు సుందరీకరణలో.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్ అథారిటీ కీలక పాత్రను పోషిస్తోంది.

భవిష్యత్ తరాలకు పర్యావరణ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు.. హెచ్ఎండీఏ ప్రణాళికాబద్ధంగా విరివిగా పచ్చదనాన్ని పెంచి పోషిస్తోంది. వరంగల్ నేషనల్ హైవే వెంట ప్రస్తుతం.. యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్స్ వరకు ఉన్న.. మల్టీలేయర్ ప్లాంటేషన్ గ్రీనరీని జనగామ వరకు పొడిగిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ దాకా గ్రీన్ కారిడార్​ను తలపించేలా పచ్చదనాన్ని పెంచి పోషించాలని.. సీఎం కేసీఆర్ పురపాలక పరిపాలన, పట్టణ అభివృద్ధి శాఖను ఆదేశించారు.

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు.. వరంగల్ నేషనల్ హైవే వెంట జనగామ వరకు దాదాపు రూ.15.04 కోట్ల వ్యయంతో మల్టీలేయర్ ప్లాంటేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రూ.15.04 కోట్ల వ్యయంతో వరంగల్ హైవే వెంట 64 కిలోమీటర్లు.. రూ.3.57 కోట్ల వ్యయంతో నాందేడ్ హైవే వెంట.. 33 కిలోమీటర్ల సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ పనులు పూర్తయ్యాయి.

సెంట్రల్‌ మిడెన్‌ గ్రీనరీ.. మల్టీలేయర్‌ ప్లాంటేషన్‌: శ్రీశైలం హైవే వెంట.. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మహేశ్వరం వరకు 18 కిలోమీటర్లు.. సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ ఏర్పాటు చేసింది. మరోవైపు ఇప్పటికే కర్నూలు జాతీయ రహదారి ఆరాంఘర్‌ నుంచి షాద్‌నగర్‌ వరకు 25 కిలోమీటర్లు.. శామీర్‌పేట్‌ నుంచి గజ్వేల్‌ వరకు దాదాపు 39 కిలోమీటర్ల వరకు చేపట్టిన సెంట్రల్‌ మిడెన్‌ గ్రీనరీ, మల్టీలేయర్‌ ప్లాంటేషన్‌ నిర్వహిస్తోంది.

హెచ్ఎండీఏ గ్రీనరీపై గతంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యయనం చేసింది. ఇటీవల కేరళకు చెందిన ఐఎఫ్ఎస్ అధికారులు వరంగల్ నేషనల్ హైవే గ్రీనరీని అధ్యయనం చేశారు. అంతేకాకుండా బెర్లిన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి చార్లెట్.. ఎడాలిన్ హ్యూమన్ జియోగ్రఫీ అనే అంశంపై పీహెచ్​డీలో భాగంగా హెచ్ఎండీఏ మల్టీ లేయర్ ప్లాంటేషన్​పై పరిశోధన చేశారు. నాందేడ్ నేషనల్ హైవే వెంట హెచ్ఎండీఏ మల్టీ లేయర్ ప్లాంటేషన్​తో పచ్చదనాన్ని పరిమళింప చేస్తోంది.

కంది క్రాస్ రోడ్స్ నుంచి రామ్​సాన్​పల్లె వరకు 32.77 కిలోమీటర్ల పొడవునా.. దాదాపు రూ.3.57 కోట్ల వ్యయంతో సెంట్రల్ మిడెన్, ఎవెన్యూ ప్లాంటేషన్ పనులు చేసింది. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ్మస్వామి దేవాలయాన్ని దృష్టిలో ఉంచుకుని.. వరంగల్ నేషనల్ హైవే గ్రీనరీ పెంపుదలకు సహకరించాలని ప్రభుత్వం రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయినా అక్కడి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపట్టింది.

వరంగల్ హైవే గ్రీనరీ బ్యూటిఫికేషన్: తొలి దశలో వరంగల్ హైవే గ్రీనరీ బ్యూటిఫికేషన్ పనులను రూ.5.5 కోట్ల అంచనాలతో.. దాదాపు 30 కిలోమీటర్ల పొడవున ఘట్​కేసర్ నుంచి రాయగిరి వరకు పనులు పూర్తయ్యాయి. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో మల్టీలేయర్ ప్లాంటేషన్ వరంగల్ వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వరంగల్ రహదారి వెంట అకుపచ్చని అందాలు అందరికీ కనువిందు చేస్తున్నాయి. యాదాద్రి మార్గంలో హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన మల్టీ లేయర్ ప్లాంటేషన్. నేషనల్ హైవే అథారిటీకి ఆదర్శంగా నిలిచింది.

ఇవీ చదవండి: దొరవారి గడుల్లో నలిగిపోయిన న్యాయమా అంటూ బండి సంజయ్ ట్వీట్

కొత్త పార్లమెంట్​ భవనంలో ప్రధాని మోదీ.. కార్మికులతో ముచ్చట్లు.. ఫొటోలు చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.