భారత దేశ ప్రగతిలో నూతన శకానికి నాంది పలికిన చిరస్మరణీయుడిగా.. మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. పీవీ 16వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ .. భారత దేశం ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటున్న సమయంలో ధైర్యంగా పలు సంస్కరణలు చేపట్టారని ప్రశంసించారు.
బహుభాషకోవిదుడు
నిండు స్వభావం, తొణకని వ్యక్తిత్వంతో ఆధ్యాత్మిక వాదిగా జీవించాడన్నాడు. 13 భాషల్లో ప్రావీణ్యం ఉన్న గొప్ప రాజనీతుజ్ఞుడని తెలుగు తేజం పీవీ నర్సింహారావుని ఆయన కొనియాడారు.
పదవులకు వన్నె తెచ్చాడు
కేంద్రంలోని పలు మంత్రిత్వ శాఖలలో మంత్రి పదవులు నిర్వహించి వాటికీ వన్నె తెచ్చిన మహానుభావుడన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా.. ఎంతో కృషి చేశారన్నారు.
కంప్యూటర్ పరిజ్ఞాని ఆయినటువంటి పీవీ 16వ వర్ధంతి సందర్భంగా.. వివిధ శాఖలలో సంస్కరణలు అమలు చేయాలి. సాంకేతికతను వేగవంతం చేసి దేశంలో సాంకేతిక సంపదను పెంపొందించాలి. ఇదే ఆ మహానుభావుడికి మనమిచ్చే ఘనమైన నివాళి.
-బండారు దత్తాత్రేయ , హిమాచల్ ప్రదేశ్ గవర్నర్
ఇదీ చదవండి:ప్రత్యేక రాష్ట్రంలో వైభవంగా అన్ని మతాల వేడుకలు: తలసాని