జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలోని మాచిన్ సెక్టార్లో ఆదివారం తీవ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన సైనిక జవాన్లకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల్, కొమాన్పల్లి నివాసియైన జవాన్ రాడ్యా మహేశ్ తండ్రి గంగమల్లుతో... దత్తాత్రేయ ఫోన్లో మాట్లాడారు. మహేశ్ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
దేశం కోసం అమరుడైన తెలంగాణ బిడ్డ రాడ్యా మహేశ్ త్యాగం మరువలేనిదన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని దత్తత్రేయ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఒక శూరున్ని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: వీరజవాన్ మహేశ్ మృతిపై నేతల సంతాపం