హైదరాబాద్‌లోని నేరెడ్‌మేట్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో, పోలీసు స్టేషన్‌లో బట్టలు విప్పి హంగామా చేసిన హిజ్రాలను కఠినంగా శిక్షించాలని హిజ్రా, ట్రాన్స్‌జెండర్ వెల్పేర్ సొసైటీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశలో పాల్గొన్న ఆ సంఘం ప్రతినిధులు కొందరి కారణంగా సమాజంలో తాము అవహేళనకు గురికావాల్సివస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం నగరంలోని జరుగుతున్న అంశాలతో పాటు హిజ్రాల వ్యక్తిగత విషయాలపై కూడా కొందరు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని హిజ్రా, ట్రాన్స్‌జెండర్ వెల్పేర్ సొసైటీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. హిజ్రాలకు ఏదైనా సమస్య వస్తే పెద్దలతో మాట్లాడి పరిష్కరించుకోవాలి తప్ప.. ఆ విషయాలపై సోషల్ మీడియా వేదికగా చర్చ చేయొద్దని సూచించారు.
ఇదీ చదవండి: ట్రాన్స్ఫార్మర్ను ఎక్కిన విద్యుత్‌శాఖ మంత్రి