ETV Bharat / state

'హిజ్రాలకు రేషన్ కార్డు లేకపోయినా... ఉచిత బియ్యం'

author img

By

Published : Jul 23, 2020, 5:43 PM IST

హిజ్రాలకు రేషన్ కార్డు లేకపోయినప్పటికీ... ఉచిత బియ్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషన్ సర్క్యూలర్ జారీ చేసినట్లు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ఉన్నత న్యాయస్థానానికి నివేదించారు.

'హిజ్రాలకు రేషన్ కార్డు లేకపోయినా... ఉచిత బియ్యం'
'హిజ్రాలకు రేషన్ కార్డు లేకపోయినా... ఉచిత బియ్యం'

హిజ్రాలకు రేషన్ కార్డు లేకపోయినప్పటికీ... ఉచిత బియ్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషన్ సర్క్యూలర్ జారీ చేసినట్లు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ఉన్నత న్యాయస్థానానికి నివేదించారు. కరోనా, లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా హిజ్రాల జీవితం భారంగా మారినందున.. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ హైదరాబాద్ కు చెందిన మోగ్లీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా హిజ్రాలకు రేషన్ దుకాణాల ద్వారా ఉచిత బియ్యం ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.