ETV Bharat / state

'టన్నెల్​లు ఏర్పాటు చేస్తున్నారా? నివేదిక సమర్పించండి'

వాణిజ్య సముదాయాలు, రద్దీ ప్రాంతాల్లో క్రిమి సంహారక టన్నెల్​లు ఏర్పాటు చేసే అంశంపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నివేదించింది.

Highcourt on Disinfectant Tunnels
టన్నెల్​లు ఏర్పాటు చేస్తున్నారా?
author img

By

Published : Apr 19, 2020, 8:33 AM IST

మార్కెట్లు, వాణిజ్య సముదాయాలు, రద్దీ ప్రాంతాల్లో క్రిమి సంహారక టన్నెల్​లు ఏర్పాటు చేసే అంశంపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నివేదించింది. రద్దీ ప్రాంతాల్లో భౌతిక దూరం నిర్వహించడం అంత సులువు కాదని.. అందుకే క్రిమి రహిత ప్రాంతాలుగా మార్చేందుకు టన్నెల్​లు ఏర్పాటు చేయాలని కోరుతూ.. న్యాయవాది రొనాల్డ్ రాజు వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.

ఒక్కో టన్నెల్ ఖర్చు రూ. 2 లక్షలు మాత్రమే ఉంటుందని.. పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ పేర్కొన్నట్లుగా టన్నెల్​లు ఏర్పాటు చేయడం సాధ్యమేనా అనే అంశంపై సమగ్ర నివేదిక సమర్పించాలని అడ్వొకేట్ జనరల్​ను ఆదేశించింది. కృత్తిమ అవయవాలతో ఉన్న వారికి క్రమం తప్పకుండా వైద్యం అందాల్సి ఉంటుందని.. కాబట్టి వారికి, సహాయకులకు పాస్​లు ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ.. శివగణేశ్​ అనే వ్యక్తి రాసిన లేఖపై హైకోర్టు విచారణ చేపట్టింది. కేవలం ప్రభుత్వంతో సాధ్యం కాదని.. అలాంటి వారికి సేవ చేసే స్వచ్ఛంద సంస్థల వివరాలు సేకరించాలని పిటిషనర్​కు సూచించింది.

ఇవీ చూడండి: మహారాష్ట్రలో 24 గంటల్లో 368 కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.