హైదరాబాద్ తెరాస పార్టీ ప్రధాన కార్యాలయమైన బంజారాహిల్స్‌లోని తెలంగాణభవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మీద దాడి జరిగిన నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు బందోబస్తును పెంచారు. తీన్మార్ మల్లన్న... తెలంగాణ భవన్‌ను ముట్టడించేందుకు వస్తున్నారన్న సమాచారంలో అప్రమత్తమైన పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.
అసలు జరిగింది ఇది..
తీన్మార్ మల్లన్న యూట్యూబ్ చానల్‌లో నిర్వహించిన ఓ పోల్‌లో తన కుమారుడిపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా కుటుంబ సభ్యులనుద్దేశించి తామూ స్పందిస్తే ఊరుకుంటారా అంటూ ధ్వజమెత్తారు. కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి నీచంగా వ్యాఖ్యలు చేయడం సంస్కారమా అని వ్యాఖ్యానించారు. భాజపా నేతలు ఇదే నేర్పిస్తున్నారా? అని ఆ పార్టీ జాతీయఅధ్యక్షుడు జేపీ నడ్డాను ప్రశ్నించారు.
కేటీఆర్ ట్వీట్ తర్వాత తన ఆఫీస్‌పై, తనపై దాడి జరిగిందంటూ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. కేటీఆర్ మనుషులు ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు. ఈ విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న తెలంగాణభవన్‌ను ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు బందోబస్తు పెంచారు.
ఇవీ చూడండి: