ETV Bharat / state

అమీన్​పూర్​ మారుతి హోంలో బాలిక మృతిపై ప్రాథమిక నివేదిక - high power committe report

అమీన్​పూర్ మారుతి హోమ్​కు చెందిన బాలిక మృతిపై హైపవర్ కమిటీ ప్రాథమిక నివేదిక సమర్పించింది. బాలికపై అత్యాచారం జరిగినట్లు కమిటీ సభ్యులు తేల్చారు. మృతిలో నిందితుల ప్రమేయంపై బలమైన ఆధారాలు సేకరించినట్లు కమిటీ నివేదికలో పేర్కొంది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత సమగ్ర నివేదికను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్​కు కమిటీ సభ్యులు సమర్పించనున్నారు.

high-power-committe-report-on-ameenpur-incident
అమీన్​పూర్​ మారుతి హోంలో బాలిక మృతిపై ప్రాథమిక నివేదిక
author img

By

Published : Sep 23, 2020, 5:07 AM IST

మారుతీ హోంలో బాలికపై అత్యాచారం జరిగినట్లు హైపవర్ కమిటీ ప్రాథమికంగా తేల్చింది. ఈ మేరకు బాలిక తోటి స్నేహితుల నుంచి కమిటీ సభ్యులు వివరాలు సేకరించారు. మారుతీ హోంను తరచూ సందర్శించే వెంకటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తనపై అత్యాచారం చేసినట్లు బాలిక బంధువులకు తెలిపింది. దీంతో బాలిక బంధువులు జూలై 31వ తేదీన బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బోయిన్​పల్లి పోలీసులు ఘటన జరిగిన ప్రాంతం పటాన్​చెరు పీఎస్ పరిధిలోకి రావడం వల్ల కేసును అక్కడికి బదిలీ చేశారు. పటాన్​చెరు పోలీసులు దర్యాప్తు చేసి వెంకటేశ్వర్ రెడ్డితో పాటు మారుతీ హోమ్ నిర్వాహకులు విజయ, జయదీప్​లను ఆగస్టు 7న అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. బాలిక అనారోగ్యంగా ఉండటం వల్ల ఆగస్టు 1వ తేదీన పోలీసులు భరోసా కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి నింబోలిఅడ్డాలోని బాలికా సంరక్షణ కేంద్రానికి తరలించారు.

చికిత్స పొందుతూ మృతి

ఆరోగ్యం విషమించి కనీసం నడవలేని స్థితికి బాలిక చేరుకోవడం వల్ల ఆగస్టు 7వ తేదీన నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. బాలిక మృతి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం వల్ల మహిళాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని నియమించారు. హోమ్​ను సందర్శిచండంతో పాటు బాలిక బంధువులు, తోటి స్నేహితులు, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కమిటీ సభ్యులు ప్రాథమికంగా నివేదిక రూపొందించారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు హైపవర్ కమిటీ ప్రాథమికంగా తేల్చింది. ఈ మేరకు భరోసా కేంద్రం నుంచి తీసుకున్న సమాచారంతో పాటు పోస్టుమార్టం రిపోర్టును నివేదికకు జతపర్చారు.

శీతలపానీయంలో మత్తు కలిపి..

బాలిక మారుతీ హోమ్​లో గత ఐదేళ్లుగా ఉండేది. లాక్​డౌన్ సందర్భంగా మార్చి 21వ తేదీన బాలికను ఆమె బంధువులకు అప్పజెప్పారు. తిరిగి జూలై 29వ తేదీన బాలికను ఆశ్రమంలో చేర్పించడానికి వెళ్తే నిర్వాహకులు అంగీకరించలేదు. అప్పటికే బాలిక అనారోగ్యంతో బాధపడుతుంది. అనారోగ్యం గురించి బాలికను బంధువులు ప్రశ్నించగా మారుతి హోమ్​లో వెంకటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఐదో అంతస్తులోకి తీసుకెళ్లి శీతలపానీయం ఇచ్చేవాడని.. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని బాలిక తెలిపింది. స్పృహ వచ్చి చూసుకుంటే ఒంటిపై దుస్తులు కూడా ఉండేవి కావని.. తోటి స్నేహితులు వచ్చి దుస్తులు వేసేవారని బాలిక తెలిపింది. హైపవర్ కమిటీ సభ్యులు తమ విచారణలో భాగంగా బాలిక కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. హోమ్​ను సందర్శించి అక్కడ పనిచేసే వాళ్లను ప్రశ్నించారు. హోమ్ నిర్వహణలో లోపాలున్నాయని తేల్చారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి పర్యవేక్షణ కొరవడినట్లు కూడా కమిటీ తేల్చింది. ఇప్పటికే సదరు అధికారిని కమిషనర్ బదిలీ చేశారు. ఈ ఘటనపై మరో తాత్కాలిక ఉద్యోగిని విధుల నుంచి తొలగించే అవకాశం ఉంది.

పర్యవేక్షణ పెంచాలి

ఇలాంటి ఘటనలు జరగకుండా అనాథాశ్రమాలపై పర్యవేక్షణ పెంచాలని కమిటీ నివేదికలో పేర్కొంది. బాలిక మృతికి గల కారణాలు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో సమగ్రంగా తెలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత హైపవర్ కమిటీ పూర్తిస్థాయి నివేదికను కమిషనర్​కు సమర్పించనున్నారు.

ఇవీ చూడండి: కుటుంబం కాదంది.. అందుకే సర్పంచే అంత్యక్రియలు చేశారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.