హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధిపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. . రాష్ట్రంలోని చారిత్రక నేపథ్యం గల ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. అలంపూర్ శక్తి పీఠం శ్రీ జోగులంబా అమ్మవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో రూ. 37 కోట్లతో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.
అలంపూర్ అభివృద్ధికి నిధులు కేటాయించటంపై ఎమ్మెల్యే అబ్రహం సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ శాసన సభ్యులు అంజయ్య యాదవ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కెఎస్ శ్రీనివాస రాజు, టూరిజం ఎండీ మనోహర్, ఈడీ శంకర్ రెడ్డి, హెరిటేజ్, బుద్ధవనం, టూరిజం అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సర్పదోషం ఉందంటూ చిన్నారిని చంపిన కన్న తల్లి