ప్రసవం కోసం ఓ నిండు గర్భిణీ వందల కిలోమీటర్లు తిరిగింది. చివరకు వైద్యుల నిర్లక్ష్యంతో శిశువుతోపాటు కన్నుమూసింది. ఈ ఘటనపై హైకోర్టు విచారణ ప్రారంభించింది. న్యాయవాదులు కిశోర్ కుమార్, శ్రీనిత లేఖ ఆధారంగా విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.
లాక్డౌన్లో ప్రసవాలు, అత్యవసర సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం న్యాయస్థానానికి వివరించగా... నిర్లక్ష్యం చేసిన వైద్యులపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. క్షేత్రస్థాయిలో ఆశించిన విధంగా చర్యలు ఉండటం లేదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వానికి పలు సూచనలు చేసేందుకు విశ్రాంత అధికారులతో కమిటీ వేయాలని సూచించింది. తదుపరి విచారణను జూన్ 10కి వాయిదా వేసింది.
ఇవీ చూడండి: 'వెయ్యి వెంటిలేటర్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం'