ETV Bharat / state

న్యాయ వ్యవస్థపై యుద్ధం ప్రకటించారా?.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు - high court latest news

high-court-serious-on-ysrcp-leaders-comments-on-courts
న్యాయ వ్యవస్థపై యుద్ధం ప్రకటించారా?.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
author img

By

Published : Oct 8, 2020, 1:47 PM IST

Updated : Oct 8, 2020, 2:53 PM IST

13:44 October 08

ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యాయ వ్యవస్థపై యుద్ధం ప్రకటించారా?.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

   ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులపై... ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. తమపై నిరంతరం దాడి జరుగుతోందని.. న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించారా.. ? అని ప్రశ్నించింది. సభాపతి, ఉపముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తులు అవమానకరంగా మాట్లాడుతున్నా స్పందించడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

    ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల ప్రతిష్ట దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న అనుచిత వ్యాఖ్యల కేసుపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించారా.. ? అని తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. ఏపీ సభాపతి తమ్మినేని సీతారాం, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చేసిన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని.. వీరిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించింది. వీరి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించేలా ఉన్నాయమని.. దీనిని న్యాయవ్యవస్థపై దాడిగానే పరిగణిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది. 

నేతలను కాపాడుతున్నారా..? 

     న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని ఏపీ హైకోర్టు మరోమారు స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో కోర్టులపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యాజ్యంపై జస్టిస్​ రాకేశ్​ కుమార్, జస్టిస్​ ఉమాదేవి బెంచ్​ విచారణ చేపట్టింది. స్వయంగా హైకోర్టు ఫిర్యాదు చేసినా... ఈ కేసు విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని సీఐడీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాల్లో హైకోర్టు న్యాయమూర్తులపై జరుగుతున్న అనుచిత ప్రచారాన్ని గుర్తించి... స్వయంగా హైకోర్టు రిజిస్టార్ ఫిర్యాదు చేస్తే... సీఐడీ కేసులు నమోదు చేసిందని గుర్తు చేసింది. హైకోర్టు స్వయంగా ఆదేశించినా ఈ కేసులో ఇంతవరకూ పురోగతి లేదని అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా కేసులు పెడుతున్న పోలీసులు.. కోర్టులు, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేతలను ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించింది. వాళ్ళను రక్షించడానికే మీరు కేసు నమోదు చేయలేదని భావించాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

సీబీఐకి ఇవ్వమంటారా..? 

      ఈ కేసు విచారణలో సీఐడీ విఫలమైతే.. దీనిని సీబీఐకు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. కేసును సీబీఐకు అప్పగించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ బదులిచ్చారు. స్పీకర్ తమ్మినేని సీతారాం.. న్యాయమూర్తులకు వ్యతిరేకంగా శాసనసభలో వ్యాఖ్యానించారా.. బయటచేశారా అని కోర్టు ప్రశ్నించింది. తిరుపతిలో మీడియా ముందు ఈ వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. 

కోర్టులను మూసేయమనండి.. 

ఈ కేసు విషయంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. సోషల్ మీడియాలో పోస్టింగుల వెనుక కుట్రను తేలుస్తామని ప్రకటించింది. ఈ నెల 1న ఇదే కేసుపై విచారణ సాగిస్తూ... " న్యాయవ్యవస్థపై విశ్వాసం లేకుంటే.. పార్లమెంట్​కు వెళ్లి ఏపీలో హైకోర్టును మూసేయమని కోరడం ఉత్తమం" అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో వివిధ సందర్భాల్లో తీర్పులు వచ్చాక... హైకోర్టును, న్యాయమూర్తులను తూలనాడుతూ.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. దీనిపై హైకోర్టు స్వయంగా స్పందించి... కొన్ని నెలల కిందట సీఐడీతో కేసు నమోదు చేయించింది. అభ్యంతరకర పోస్టులను అనుమతించిన సామాజిక మాధ్యమాలకు కూడా నోటీసులు జారీ చేసింది. సీఐడీ ఈ కేసులో 98మందికి నోటీసులు జారీ చేసింది. వీరిలో కొంతమందిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. అప్పటి నుంచి కేసు విచారణ సరైన రీతిలో సాగడం లేదని కోర్టు వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన అమలుకాకపోతే..ఇతర నిబంధనల ప్రకారం అధికారాన్ని వినియోగిస్తామని హెచ్చరించింది. న్యాయవ్యవస్థ నిరుపయోగమైతే సివిల్ వార్​కు దారితీస్తుందని కోర్టు ఇంతకు ముందు వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి: 12,13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు.. చట్ట సవరణలు చేసే అవకాశం!

Last Updated : Oct 8, 2020, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.