హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జీహెచ్ఎంసీ చేపట్టిన రహదారి నిర్మాణంపై యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. హెచ్‌సీయూ సిబ్బంది, విద్యార్థులు మినహా ఇతరులెవరి రాకపోకలను అనుమతించరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
హెచ్‌సీయూ భూముల్లో జీహెచ్ఎంసీ రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఈ విషయంపై హెచ్‌సీయూ దాఖలు చేసిన అప్పీల్‌పై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. చట్ట ప్రకారం భూసేకరణ చేయకుండా యూనివర్సిటీ భూముల్లో రోడ్డు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించింది. యూనివర్సిటీలో వందల ఎకరాల భూములు కుదించుకుపోయాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చట్ట ప్రకారం భూసేకరణ ప్రక్రియ చేపట్టుకోవచ్చునని సూచించిన ధర్మాసనం.. అప్పటి వరకు హెచ్‌సీయూ భూముల్లోకి ప్రవేశించొద్దని పేర్కొంది.
ఇదీ చూడండి: రాజ్‌భవన్ రాసిచ్చినా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారా..?: హైకోర్టు