ETV Bharat / state

'ఉస్మానియా ఆస్పత్రి వివాదం..వాటిని పరిశీలించాలి' - ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై హైకోర్టులో పిల్స్​ దాఖలు

హైదరాబాద్​లో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం వివాదంపై అనేక అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని హైకోర్టు తెలిపింది. ఆస్పత్రి నిర్మాణం కోసం ప్రస్తుత భవనం కూల్చాల్సిందేనా? వివాదాస్పద హెరిటేజ్ భవనం పక్కన పెట్టి మిగతా ప్రాంతంలో నిర్మించవచ్చా.. వంటి అనేక అంశాలను చూడాల్సి ఉందని పేర్కొంది.

high-court-said-construction-of-osmania-hospital-they-should-be-examined
'ఉస్మానియా ఆస్పత్రి వివాదం..వాటిని పరిశీలించాలి'
author img

By

Published : Sep 8, 2020, 6:09 PM IST

ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం వివాదంపై అనేక అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. ఉస్మానియా ఆస్పత్రి కూల్చవద్దని కొందరు.. కూల్చివేసి కొత్తగా నిర్మించాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలన్నీ కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్​.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది.

ఉస్మానియా ఆస్పత్రి గూగుల్ మ్యాప్, సైట్ ప్లాన్ ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. పిటిషనర్లకు కూడా మ్యాపులు ఇవ్వాలని అడ్వకేట్ బీఎస్.ప్రసాద్​ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పటాలని విశ్లేషించి వాదనలకు సిద్ధం కావాలని పిటిషనర్ తరపు న్యాయవాదులకు హైకోర్టు తెలిపింది.

మూడు బ్లాకుల్లో హెరిటేజ్ భవనం ఉందని.. అది కాకుండా మరో 15 ఎకరాల్లో మిగతా ఆస్పత్రి ఉన్నట్టు పటాల్లో ఆర్​ అండ్​ బీ పేర్కొంది. ఆధునిక, సమీకృత ఆస్పత్రి నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏజీ బీఎస్.ప్రసాద్ పేర్కొన్నారు. ఆస్పత్రి నిర్మాణం కోసం ప్రస్తుత భవనం కూల్చాల్సిందేనా? వివాదాస్పద హెరిటేజ్ భవనం పక్కన పెట్టి మిగతా ప్రాంతంలో నిర్మించవచ్చా? వంటి అనేక అంశాలను పరిశీలించాల్సి ఉందన్నారు.

సుదీర్ఘ విచారణ జరగాల్సి ఉన్నందున.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా హైకోర్టు తెరిచాక నేరుగా విచారణ జరపాలని సీనియర్ న్యాయవాది సత్యం రెడ్డి కోరారు. అయితే వైద్యులు, పేషంట్లు ఇబ్బంది పడుతున్నారని.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే త్వరగా పూర్తి చేయాలని న్యాయవాది సందీప్ రెడ్డి కోరారు. తేల్చిన వెంటనే భవనం కట్టేస్తారా అన్న హైకోర్టు.. పోలీస్ జంట భవనాల నిర్మాణం ఆరేళ్లుగా సాగుతోందని ఉదహరించింది. తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి : 'కేసీఆర్ అసెంబ్లీని ఫామ్ హౌస్​లో పెట్టుకుంటే బాగుంటుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.