ETV Bharat / state

Highcourt Review on Corona: 'ఒక్క జిల్లాలోనూ అలాంటి పరిస్థితి తలెత్తలేదు' - High court Review on Covid

High court Review on Corona: రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై ఇవాళ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన నివేదికను ఇప్పటికే ధర్మాసనానికి వైద్యాధికారులు సమర్పించారు.

Highcourt
Highcourt
author img

By

Published : Jan 17, 2022, 5:36 AM IST

High court Review on Corona: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టు మరోసారి విచారణ జరపనుంది. ఈనెల 12 వరకు ఉన్న కరోనా పరిస్థితులపై డీహెచ్ శ్రీనివాసరావు ఉన్నత న్యాయస్థానానికి ఇప్పటికే నివేదిక సమర్పించారు. కొవిడ్ నియంత్రణకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నామని డీహెచ్ పేర్కొన్నారు. ఈనెల 12 నాటికి పాజిటివిటీ రేటు అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 6.95.. జీహెచ్ఎంసీలో 5.65 శాతానికి చేరిందన్నారు.

పాజిటివిటీ రేటు పది శాతానికి చేరితే...

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పాజిటివిటీ రేటు పది శాతానికి చేరితే రాత్రి కర్ఫ్యూ, కార్యాలయాల్లో సిబ్బంది, ప్రజా రవాణా వ్యవస్థ తగ్గింపు వంటి ఆంక్షలు విధించాల్సి ఉంటుందని.. అయితే ఈనెల 12 నాటికి ఒక్క జిల్లాలోనూ అలాంటి పరిస్థితి తలెత్తలేదని డీహెచ్ తెలిపారు. ముందు జాగ్రత్తగా సభలు, సమావేశాలు, ఇతర జన సమూహాలపై ఈనెల 20 వరకు నిషేధం విధించినట్లు డీహెచ్ శ్రీనివాసరావు నివేదికలో తెలిపారు. ఈ ఏడాది తొలి 12 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 18 వేల 196 కేసులు నమోదయ్యాయని.. సరాసరి పాజిటివిటీ రేటు 2.76శాతం ఉందన్నారు.

అందుబాటులో కిట్లు...

నిపుణుల కమిటీ సూచనల మేరకు.. రాష్ట్రంలో జ్వరం సర్వే, ఓపీ క్లినిక్​లు నిర్వహిస్తున్నామని కరోనా పరీక్షలు, ఔషధాల కిట్​లను అందుబాటులో ఉంచినట్లు డీహెచ్ వివరించారు. సరిహద్దులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద 132 కేంద్రాల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కొవిడ్ చికిత్సల కోసం ప్రభుత్వాస్పత్రుల్లో 56 వేల 36 పడకలు ఉన్నాయని.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కలిపి రోజుకు 332 మెట్రిక్ టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు.

ప్రత్యేక వార్డులు...

ఒమిక్రాన్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా లేకపోయినప్పటికీ... నిలోఫర్​తో పాటు బోధనాస్పత్రులు, జిల్లా వైద్య కేంద్రాలు, ఇతర ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు శ్రీనివాసరావు వివరించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ మొదటి డోసు 100 శాతం.. రెండో 74 శాతం పూర్తయిందని.. 83 లక్షల 1673 మంది 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి.. 83 వేల 421 మందికి ప్రికాషనరీ డోసులు ఇచ్చినట్లు తెలిపారు.

ఇదీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.