ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి రైతుల పాదయాత్రపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. పాదయాత్రలో 600 మందే పాల్గొంటామని అమరావతి రైతులు కోర్టుకు తెలిపారు. మధ్యలో ఎవరైనా తప్పుకుంటే.. ఇతరులను అనుమతించాలని కోరారు. మధ్యలో వచ్చేవారి వివరాలను పోలీసులకు అందిస్తామని స్పష్టం చేశారు.
సంఘీభావం తెలిపేవారు పాదయాత్రకు ముందు, వెనుక ఉండేలా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు హైకోర్టు నిబంధనలను రైతులు పాటించడం లేదని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు.
ఇవీ చదవండి: