High Court On Reseravtions: ఉద్యోగాల భర్తీలో ఎస్టీలకు 9.8శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. గ్రూప్-1, పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్లపై స్టే ఇవ్వాలన్న అఖిల భారత గిరిజన సమాఖ్య అభ్యర్థనను తోసిపుచ్చింది. ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నోటిఫికేషన్లు ఇచ్చారని... అయితే జనాభా ప్రకారం 9.8శాతం రిజర్వేషన్ కల్పించాలని పిటిషనర్ల వాదన. ఏ చట్టం ప్రకారం తప్పనిసరిగా ప్రభుత్వం 9.8శాతం రిజర్వేషన్ ఇవ్వాలో పిటిషన్లో వివరించలేదని సీజే జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనం పేర్కొంది. విచారణకు నిరాకరించిన ధర్మాసనం... చట్టబద్ధత వివరిస్తూ అవసరమైతే మరో పిల్ వేసుకోవాలని సూచించింది.
Group 1 Prelims 2022 : గ్రూప్-1 దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో తొలిదశ వడపోత పరీక్ష(ప్రిలిమ్స్) నిర్వహణపై టీఎస్‌పీఎస్సీ కసరత్తు ఆరంభించింది. అత్యధికంగా 503 పోస్టులతో వెలువడిన ఈ ప్రకటనకు రికార్డుస్థాయిలో 3,80,202 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగ ప్రకటనలో జులై లేదా ఆగస్టు నెలల్లో ప్రిలిమినరీ ఉంటుందని కమిషన్ గతంలో ప్రకటించింది. అయితే సెప్టెంబరు నెలాఖరు వరకు పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, సివిల్స్, బ్యాంకు, పోలీసు కొలువుల పరీక్షలకు షెడ్యూలు ఇప్పటికే ఖరారైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో పెట్టుకుని ప్రిలిమ్స్ తేదీపై ముందుకు వెళ్లాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది.
Police Preliminary Examination: రాష్ట్రంలో పోలీస్ నియామక ప్రక్రియలో తొలుత నిర్వహించే ప్రాథమిక రాత పరీక్షలను మూడు నెలల్లో పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు తొలివారంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించే యోచనలో ఉన్నారు. అభ్యర్థుల వడపోతగా భావించే ప్రాథమిక రాతపరీక్ష ఫలితాలను సెప్టెంబరులోగా ప్రకటించాలనే ప్రయత్నాల్లో ఉన్నామని నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు చెప్పారు. అక్టోబరు రెండో వారంలో శారీరక సామర్థ్య(పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహిస్తామని, నవంబరులోగా ఫలితాలిస్తామని.. జనవరి లేదా ఫిబ్రవరిలో తుది రాతపరీక్షలుంటాయన్నారు. అన్నీ సవ్యంగా సాగితే మార్చిలోపు తుది ఫలితాల్ని ప్రకటిస్తామన్నారు.
ఇవీ చూడండి: