ETV Bharat / state

కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడంపై వివరణ ఇవ్వండి: హైకోర్టు​

ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళుతున్న కాంగ్రెస్​ నేతలను అడ్డుకోవడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అరెస్టులకు గల కారణాలను పేర్కొనకపోవడం పట్ల వివరణ కోరింది.

High Court orders to Govt on congress leaders arrests
కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడంపై వివరణ ఇవ్వండి: హైకోర్టు​
author img

By

Published : Jun 20, 2020, 9:09 AM IST

కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వెళుతున్న ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం.. అరెస్టులకు గల కారణాలను పేర్కొనకపోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

పోలీసులు తమను అక్రమంగా అరెస్టు చేసి.. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారంటూ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​కుమార్​రెడ్డితో పాటు మరో 11 మంది నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, అరెస్టులకు తగిన కారణాలను చూపలేదని కాంగ్రెస్ నేతల తరఫు న్యాయవాదులు వాదించారు.

పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడానికి వెళుతున్న వారిని అడ్డుకున్నారని హైకోర్టుకు విన్నవించారు. ఈ నెల 20 నుంచి జులై 3 వరకు వివిధ ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని.. వాటికి ప్రభుత్వం అడ్డుపడకుండా ఆదేశాలివ్వాలని కోరారు. కొవిడ్​ మార్గదర్శకాలకు అనుగుణంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

దీనిపై ఏజీ బి.ఎస్.ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నేతల కార్యక్రమాల వల్ల రద్దీ ఏర్పడుతోందని, తద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం ఉందన్నారు. కొవిడ్​ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారని, అందువల్ల వారి కార్యక్రమాలను అనుమతించడం లేదని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

ఇదీచూడండి: ధరల పెరుగుదలపై స్పందించిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.