ప్రజాసంఘాల నిషేధంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 16 సంఘాల నిషేధంపై అమరుల బంధుమిత్రుల సంఘం ప్రధాన కార్యదర్శి పద్మకుమారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. మావోయిస్టు అనుబంధ సంఘాలంటూ చట్టవ్యతిరేకంగా నిషేధం విధించారని పిటిషనర్ పేర్కొన్నారు.
నిబంధనల ప్రకారమే నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉన్నత న్యాయస్థానానికి ఏజీ తెలిపారు. దీనికి సంబంధించిన కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: గ్రీన్ టీతో ప్రశాంతత, చురుకుదనం