ETV Bharat / state

సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్ - హైదరాబాద్​ వార్తలు

సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్ పడింది. సోమవారం వరకు కూల్చివేతలు చేపట్టరాదని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నట్టు ప్రాథమికంగా కనిపిస్తోందన్న ఉన్నత న్యాయస్థానం.. కూల్చివేతలకు సంబంధించిన అనుమతి పత్రాలను సమర్పించాలని స్పష్టం చేసింది. పిటిషన్‌పై తదుపరి విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది.

high court order to stop secretariat demolished in hyderabad
సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్
author img

By

Published : Jul 10, 2020, 6:18 PM IST

Updated : Jul 10, 2020, 6:48 PM IST

సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్

సచివాలయ భవనాల కూల్చివేత పనులు సోమవారం వరకు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిబంధనలు పాటించకుండా కూల్చివేత పనులు చేపట్టినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని వ్యాఖ్యానించింది. సచివాలయం కూల్చివేతను ఆపేలా ఆదేశించాలని కోరుతూ తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షుడు పీఎల్​ విశ్వేశ్వరరావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్​ఎస్​ చౌహాన్, జస్టిస్ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

వ్యర్థ పదార్థాల నిర్వహణ చట్టానికి విరుద్ధంగా కూల్చివేతలు

జీహెచ్​ఎంసీ, ఇతర ఎలాంటి అనుమతులు లేకుండా కూల్చివేతలు చేపట్టారని.. పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. కూల్చివేతలు, వ్యర్థ పదార్థాల నిర్వహణ చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల్లో భారీ కూల్చివేతల వల్ల పరిసర ప్రాంతాల్లోని లక్షల మంది స్వచ్ఛమైన గాలి కూడా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాదించారు. హుస్సేన్‌సాగర్ బఫర్‌జోన్‌లో నిర్మాణాలు, కూల్చివేతలు కూడా చేపట్టరాదని వాదించారు.

రాజకీయ దురుద్దేశాలతో పిటిషన్ దాఖలు

కూల్చివేతలకు సంబంధించిన అనుమతులున్నాయా అని అడ్వకేట్ జనరల్ బీఎస్​ ప్రసాద్‌ను హైకోర్టు ప్రశ్నిచింది. అనుమతుల పత్రాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలన్న ఏజీ... రాజకీయ దురుద్దేశాలతో పిటిషన్ దాఖలు చేశారని వాదించారు. ప్రభుత్వ చర్య చట్ట విరుద్ధంగా ఉన్నట్టు భావిస్తే.. ప్రశ్నించే హక్కు ప్రతీ పౌరుడికి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిబంధనలు పాటించడం లేదని ప్రాథమికంగా తెలుస్తున్నందున.. కూల్చివేతలు కొనసాగించొద్దని స్పష్టం చేసింది. సోమవారంలోగా అనుమతులు, వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రణాళిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. అప్పటివరకు కూల్చివేతలు నిలిపి వేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈనెల 13కి వాయిదా వేసింది. సచివాలయం కూల్చివేతలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తదితరులు​ మండిపడ్డారు.

ఇదీ చదవండి: కూల్చివేత ఎఫెక్ట్​: ఆలయం, మసీదు దెబ్బతినటంపై సీఎం ​విచారం

Last Updated : Jul 10, 2020, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.