HighCourt Verdict on TSPSC Members : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆరుగురు సభ్యుల నియామకాన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లింగారెడ్డి, రవీందరెడ్డి, సత్యనారాయణ, ధన్‌సింగ్, సుమిత్ర, చంద్రశేఖర్ నియామకాలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. కాకతీయ వర్సిటీ విశ్రాంత ప్రొ.వినాయక్‌రెడ్డి పిల్‌పై విచారణ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. టీఎస్‌పీఎస్సీ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం 2021 మే 19న జీవో 108 జారీ చేసింది.
ఈ క్రమంలోనే ఈ ఆరుగురు సభ్యుల అర్హతలు నిబంధనల మేరకు లేవని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వీరి అర్హతను పునఃపరిశీలించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం 3నెలల్లో కసరత్తు పూర్తి చేయాలని సూచించింది. ఈ క్రమంలోనే ఆరుగురి నియామకాన్ని రద్దు చేయాలన్న ప్రశ్న ప్రస్తుతం అవసరం లేదన్న ధర్మాసనం.. ఆరుగురి నియామకం ప్రభుత్వ తాజా కసరత్తుకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకాలకు ఓ విధానం లేదా?