Audit Diwas celebrations: హైదరాబాద్ అకౌంట్స్ జనరల్ ఆఫీస్‌లో ఆడిట్ దివస్ వేడుకలను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్ రావు ప్రారంభించారు. 21వ తేది నుంచి 26వ తేది వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గోనున్న అకౌంట్స్ అండ్ ఆడిటింగ్ ఉద్యోగులు 26వ తేదిన ఉదయం 8గంటలకు ట్యాంక్ బండ్ వద్ద వాకథాన్‌లో పాల్గొననున్నారు.
వాక్‌థాన్‌తో పాటు ఆడిట్ దివస్‌ను పురస్కరించుకొని వివిధ ఆటల పోటీలు కూడా నిర్వహించనున్నట్లు సంస్థ తెలిపింది. ఆడిటింగ్ జనరల్ వారు చేసే పనిని సామాన్య ప్రజలు సైతం తెలుసుకోవాలని ముఖ్య అతిథి జస్టిస్ నవీన్‌రావు అన్నారు. వారం రోజుల పాటు జరగనున్న ఈ ఆడిట్ దివాస్ వేడుకలలో ఉద్యోగులంతా ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. ఎప్పుడు వెనుక ఉండి పనిచేసే ఆడిటింగ్ వారి కోసం ప్రజలకు అవగాహన కల్పించే సమయం ఆసన్నమైందన్నారు.
ఇవీ చదవండి: