Puvva Ajay: ఖమ్మంలో భాజపా కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనలో కేంద్ర, రాష్ట్ర హోంశాఖలు, ఖమ్మం సీపీ, త్రీటౌన్ ఎస్‌హెచ్‌వో, సీబీఐకి కూడా నోటీసులిచ్చింది. ఖమ్మం తెరాస నేత ప్రసన్నకృష్ణ, సీఐ సర్వయ్యకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
ఈ ఘటనపై న్యాయవాది కె.కృష్ణయ్య దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. భాజపా కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు జరపాలని పిటిషనర్ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. రెండు వారాల్లో ఘటనపై వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.
అసలెేం జరిగిందంటే: కేసుల పేరుతో పోలీసులు వేధిస్తున్నారంటూ ఈ నెల 14న సాయిగణేశ్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ చనిపోయాడు. సాయి మృతికి అధికారి పార్టీ నాయకులు, పోలీసుల వేధింపులే కారణమని భాజపా శ్రేణులు చేసిన ఆందోళన ఖమ్మంలో ఉద్రిక్తతలకు దారితీసింది.
ఇవీ చూడండి: సాయిగణేశ్ కుటుంబసభ్యులను పరామర్శించిన కేెంద్ర సహాయమంత్రి
సాయిగణేశ్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన కేంద్రమంత్రి అమిత్షా..
భాజపా కార్యకర్త ఆత్మహత్య.. ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులు.. తెరాస వేధింపులే కారణమా.?