ETV Bharat / state

HIGHCOURT: విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై దాఖలైన పిల్​పై నేడు హైకోర్టులో విచారణ - telangana varthalu

ప్రీ ప్రైమరీ, ప్రైమరీ తరగతులకు ప్రత్యక్ష బోధన నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిల్​పై నేడు విచారణ జరగనుంది. విచారణ పూర్తయ్యే వరకూ విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనకు అనుమతిస్తూ జారీ చేసిన మెమో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిల్​లో కోరారు.

HIGHCOURT: విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై దాఖలైన పిల్​పై నేడు హైకోర్టులో విచారణ

author img

By

Published : Aug 31, 2021, 3:50 AM IST

శాస్త్రీయ అధ్యయనం లేకుండానే విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనకు నిర్ణయం తీసుకున్నారన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రీప్రైమరి, ప్రైమరీ తరగతులకు ప్రత్యక్ష బోధన ఆపాలని.. విచారణ పూర్తయ్యే వరకూ విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనకు అనుమతిస్తూ జారీ చేసిన మెమో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిల్​లో కోరారు. ప్రైవేట్ ఉపాధ్యాయుడు బాలకృష్ణ దాఖలు చేసిన పిల్​పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది.

విద్యా శాఖ నిర్ణయం చిన్న పిల్లల ప్రాణాలను పణంగా పెట్టేలా ఉందని పిల్​లో పేర్కొన్నారు. మరోవైపు మూడో దశ కరోనా పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందన్న నివేదికలు ఆందోళనలు కలిగిస్తున్నాయన్నారు. ఆన్​లైన్ లోనూ కొనసాగిస్తారా.. భౌతిక దూరం ఎలా పాటిస్తారు తదితర అంశాలపై విద్యా శాఖ ఉత్తర్వుల్లో స్పష్టతనివ్వలేదన్నారు. వైద్యారోగ్య సలహా కమిటీ నివేదికను కూడా బయట పెట్టలేదన్నారు. ముందుగా ఉన్నత పాఠశాలలు ప్రారంభించి పరిశీలించిన తర్వాత ప్రీప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులకు మొదలు పెడితే బాగుండేదని పిటిషనర్ అభిప్రాయపడ్డారు.

పిల్లలకు కరోనా సోకితే వెంటనే గుర్తించడం కష్టమని.. ఈ లోగా తరగతి గది అంతటితో పాటు.. వారి ఇళ్లల్లోని వృద్ధులకూ ముప్పు ఉంటుందన్నారు. కాబట్టి ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరారు. విద్యా శాఖ కార్యదర్శి, పాఠశాల విద్య సంచాలకురాలు, ప్రజారోగ్య సంచాలకుడు, కొవిడ్ పై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల సలహా కమిటీని ప్రతివాదులుగా చేర్చారు.

ఇదీ చదవండి: విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.