ETV Bharat / state

HIGH COURT: రామప్ప కట్టడం అభివృద్ధి, నిర్వహణను స్వయంగా పర్యవేక్షిస్తాం: హైకోర్టు - ramappa temple unesco world heritage

రామప్ప కట్టడానికి ప్రపంచ వారసత్వ హోదాను శాశ్వతంగా దక్కించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన నడుం బిగించాలని హైకోర్టు కోరింది. యునెస్కో విధించిన గడువులోగా.. సమగ్ర పరిరక్షణ, అభివృద్ధి ప్రాజెక్టును పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అధికారులు నిర్లక్ష్యం చేస్తే దేశం మొత్తం నిందిస్తుందని హెచ్చరించింది. ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందడం రాష్ట్రానికి గర్వకారణమని.. రామప్ప కట్టడం అభివృద్ధి, నిర్వహణను స్వయంగా పర్యవేక్షిస్తామని హైకోర్టు పేర్కొంది. మరోవైపు గోల్కొండ సహా రాష్ట్రంలోని 27 జాతీయ చారిత్రక కట్టడాల అభివృద్ధి, నిర్వహణకు నాలుగు వారాల్లో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది.

HIGH COURT: రామప్ప కట్టడం అభివృద్ధి, నిర్వహణను స్వయంగా పర్యవేక్షిస్తాం: హైకోర్టు

author img

By

Published : Jul 28, 2021, 7:58 PM IST

రామప్ప కట్టడానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా దక్కడం తెలంగాణకు గర్వకారణమని హైకోర్టు పేర్కొంది. డిసెంబరు నెలాఖరులోగా యునెస్కో చెప్పిన విధంగా అభివృద్ధి, నిర్వహణ ప్రాజెక్టు పూర్తి స్థాయి.. శాశ్వత దక్కించుకోవాలని స్పష్టం చేసింది. డిసెంబరు నెలాఖరు వరకు సమగ్ర పరిరక్షణ, అభివృద్ధి ప్రాజెక్టు పూర్తి చేయాలని యునెస్కో అనుబంధ సంస్థ... అంతర్జాతీయ కట్టడాలు, ప్రాంతాల మండలి.. ఐకొమాస్ స్పష్టం చేసింది. పత్రికల కథనాల ఆధారంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం స్వచ్ఛందంగా విచారణ చేపట్టింది. రామప్ప కట్టడానికి యునెస్కో గుర్తింపు పట్ల హర్షం వ్యక్తం చేసిన హైకోర్టు.. ప్రపంచ పటంలో స్థానం పొందడం రాష్ట్రానికి గర్వకారణమని వ్యాఖ్యానించింది. అయితే ప్రపంచ అంచనాలకు అనుగుణంగా రామప్ప పరిసరాలను తీర్చిదిద్దాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

యుద్ధ ప్రాతిపదికన నడుం బిగించాలి..

చారిత్రకంగా అత్యంత విలువైన రామప్ప సంపద...అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతుందని ధర్మాసనం ఆశాభావం వ్యక్తం చేసింది. శాశ్వత హోదా కోసం డిసెంబరు నెలాఖరు వరకు సమగ్ర పరిరక్షణ, అభివృద్ధి ప్రాజెక్టు పూర్తి చేయాలని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖలు, హెరిటేజ్ కమిటీ ఉన్నతాధికారులు, కలెక్టర్​తో కూడిన కమిటీ నడుం బిగించాలని దిశానిర్దేశం చేసింది. హైదరాబాద్​లో ఆగస్టు 4న తొలి సమావేశం నిర్వహించాలని.. ఆ తర్వాత సందర్భానుసారంగా భేటీ కావాలని ఆదేశించింది. రామప్ప కట్టడాల క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని తెలిపింది. ఇప్పటికే సమయం ప్రారంభమైందని.. డిసెంబరు నెలాఖరుతో ముగియనున్నందున.. యుద్ధ ప్రాతిదికన నడుం బిగించాలని సూచించింది. ప్రపంచ వారసత్వ హోదా కోసం పనిచేసే గొప్ప అవకాశం లభించిందని పేర్కొంది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి శాశ్వత హోదా చేజారించుకుంటే.. కోర్టే కాదు దేశమంతా నిందిస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాబట్టి నిర్దిష్ట కాలపరిమితులు విధించుకొని పని చేయాలని స్పష్టం చేసింది. రామప్ప సమగ్ర పరిరక్షణ, అభివృద్ధిని హైకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తుందని ధర్మాసనం తెలిపింది. సమగ్ర ప్రణాళిక, తేదీలతో నాలుగు వారాల్లో బ్లూప్రింట్ సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు25కి వాయిదా వేసింది.

ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి..

గోల్కొండ సహా రాష్ట్రంలోని 27 జాతీయ చారిత్రక కట్టడాల అభివృద్ధి, నిర్వహణకు నాలుగు వారాల్లో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. నిర్వహణ నిర్లక్ష్యం వల్ల గోల్కొండ, కుతుబ్ షాహీ టూంబ్స్ దెబ్బతింటున్నాయన్న పత్రికల కథనాలను సుమోటోగా తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించారు. రాష్ట్రంలోని 27 చారిత్రక కట్టడాలను కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన జరిపిందని ప్రభుత్వం తెలిపింది. కమిటీ సభ్యులు పలు సూచనలు ఇచ్చారని... దాని ప్రకారం సమగ్ర అభివృద్ధి, నిర్వహణ ప్రణాళికను సవరించేందుకు సమయం ఇవ్వాలని కోరింది. అంగీకరించిన ధర్మాసనం నాలుగు వారాల్లో ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ఆదేశించింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.