ETV Bharat / state

న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించడం తగదు: హైకోర్టు

high court, water war
హైకోర్టు, జలవిద్యుత్ ఉత్పత్తి
author img

By

Published : Jul 6, 2021, 11:38 AM IST

Updated : Jul 6, 2021, 10:51 PM IST

11:21 July 06

కృష్ణానది జలవిద్యుత్ ఉత్పత్తి వివాదంపై హైకోర్టులో విచారణ

కృష్ణా జలాల వివాదంపై ఏ ధర్మాసనం విచారణ చేపట్టాలనే అంశంపై హైకోర్టులో నేడు కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కృష్ణా జిల్లా రైతులు దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనమే విచారణ చేపట్టాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ఇవాళ మరోసారి కోరారు. రోస్టర్ ప్రకారం నదీజలాల వివాదాలపై సీజే ధర్మాసనమే విచారణ చేపట్టాల్సి ఉంటుందని వివరించారు. స్పందించిన సీజే ధర్మాసనం... ఆ విషయాన్ని జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ధర్మాసనం, పిటిషనర్ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రారవు ధర్మాసనానికి ఏజీ బీఎస్ ప్రసాద్ ఆ విషయాన్ని వివరించారు. 

సీజే నుంచి స్పష్టత తీసుకున్న తర్వాత.. నిన్న విచారణ చేపట్టాలని జస్టిస్ ఎంఎస్ఆర్ ధర్మాసనం తెలిపింది. విచారణ ప్రారంభమయ్యాక ఇప్పుడు అభ్యంతరాలేంటని అసహనం వ్యక్తం చేసింది. తమ ధర్మాసనం ఎందుకు విచారణ చేపట్టకూడదో తెలపాలని పేర్కొంది. న్యాయమూర్తి ఏపీకి చెందిన వ్యక్తి కాబట్టి విచారణ చేపట్టవద్దని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వేదుల వెంకటరమణ జస్టిస్ ఎంఎస్ఆర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఏజీ తీరు దురదృష్టకరమని.. ఇది బెంచ్ హంటింగేనని జస్టిస్ ఎంఎస్ఆర్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. విషయంపై స్పష్టత తీసకున్న తర్వాత మధ్యాహ్నం రెండున్నరకు నిర్ణయిస్తామని పేర్కొంది.

ఆ తర్వాత జస్టిస్ రామచంద్రరావు ధర్మాసనం వద్ద జరిగిన విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనానికి ఏజీ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం, పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అనవసర గందరగోళం సృష్టిస్తున్నారని సీజే జస్టిస్ హిమా కోహ్లీ అసహనం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులకు వ్యక్తిగత ఉద్దేశ్యాలను ఆపాదించడం తగదన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఏజీ వంటి ఉన్నతాధికారి నుంచి ఇలాంటి స్పందన ఊహించలేమని సీజే వ్యాఖ్యానించారు. న్యాయమూర్తికి వ్యక్తిగత ఉద్దేశాలు ఆపాదిస్తూ... ఒకవేళ పిటిషన్ దాఖలు చేస్తే వెంటనే ఉపసంహరించుకోవాలని సీజే కోరారు. 

స్పందించిన ఏజీ ప్రసాద్.. మధ్యంతర పిటిషన్​ను ఉపసంహరించుకుంటామన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వేదుల వెంకట రమణ తీరుపట్ల కూడా ప్రధాన న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. నదీ జలాల వివాదం సీజే ధర్మాసనం వద్ద.. పునర్విభజన చట్టానికి సంబంధించిన వివాదాలు జస్టిస్ ఎంఎస్ఆర్ ధర్మాసనం వద్దకు వెళ్తాయన్నారు. ఈ పిటిషన్​లో రెండు వివాదాలు ఉన్నందున... రిజిస్ట్రీ బెంచి ఖరారు చేసే వరకు ఆగడకుండా... పిటిషనర్ల తరఫు న్యాయవాది అనవసర ఒత్తిడి తెచ్చారని సీజే ఆక్షేపించారు. 

ధర్మాసనం ఖరారు కాకముందే అత్యవసర విచారణ చేపట్టాలని నిన్న జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ధర్మాసనం వద్ద ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది తీరు కూడా బెంచ్ హంటింగేనని సీజే అభిప్రాయపడ్డారు. ఫలానా ధర్మాసనమే కావాలని ఒత్తిడి చేయడం ఇరువైపులా తగదన్నారు. వివాదంలోని అంశాలు ముఖ్యం కానీ.. ధర్మాసనం ఎవరనేది అవసరం లేదన్నారు. రోస్టర్ తమ విచక్షణ అని సీజే స్పష్టం చేశారు. రోస్టర్ ప్రకారం ఈ పిటిషన్ ఎవరు చేపట్టాలో ఖరారు చేసి.. విచారణ తేదీని వెల్లడిస్తామని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.

సీజే ధర్మాసనం వద్ద జరిగిన వివరాలను మధ్యాహ్నం రెండున్నరకు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ధర్మాసనానికి వివరించారు. ఇప్పటి వరకు జరిగిన విషయాన్ని ఉత్తర్వుల రూపంలో సీజే ముందుంచుతామని... ప్రధాన న్యాయమూర్తి తగిన నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం తెలిపింది.

ఇదీ చదవండి: TS AP WATER WAR: కృష్ణా జలాల వివాదంపై స్వరం పెంచిన తెలుగు రాష్ట్రాలు 

Last Updated : Jul 6, 2021, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.