ETV Bharat / state

సామాజిక సేవ చేస్తే శిక్ష రద్దు చేస్తాం: హైకోర్టు

సామాజిక సేవ చేస్తే శిక్షను రద్దు చేస్తామని నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్​కు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రతిపాదించింది. ఏం చేశారో తదుపరి విచారణలో వివరించాలని సూచించింది. కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్ జడ్జ్​ ఉత్తర్వులను సవాల్​ చేస్తూ చేసిన అప్పీల్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

high court given Punishment for doing social service to nalgonda collector
సామాజిక సేవ చేస్తే శిక్ష రద్దు చేస్తాం: హైకోర్టు
author img

By

Published : Mar 3, 2021, 11:48 PM IST

ప్రజలకు ఉపయోగపడే మంచిపని చేస్తే శిక్ష రద్దును పరిశీలిస్తామని నల్గొండ జిల్లా ప్రశాంత్​ జీవన్​ పాటిల్​కు రాష్ట్ర హైకోర్టు ప్రతిపాదించింది. కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్ జడ్జ్​ ఉత్తర్వులను సవాల్​ చేస్తూ చేసిన అప్పీల్​పై.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏం చేశారో తదుపరి విచారణలో తెలపాలని ఆదేశించింది. తదుపరి కేసు విచారణను ఏప్రిల్ ఏడుకి వాయిదా వేసింది.

గతంలో వరంగల్ జిల్లా సంయుక్త కలెక్టర్​గా ప్రశాంత్​ జీవన్​ పాటిల్ పనిచేశారు. న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా రైస్​మిల్లు ధాన్యం సరఫరా చేయడం లేదని జీవన్​ పాటిల్, కొందరు అధికారులపై.. మిల్లు యజమాని కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు 2017లో రూ.2వేలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించపోతే ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని తీర్పులో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఆరేళ్లుగా ప్రశ్నిస్తున్నా.. మరో అవకాశం ఇవ్వండి: రాంచందర్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.