HC orders to police: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో భాజపా నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పీఏ రాజును విచారణకు హాజరు కావాలంటూ ఒత్తిడి చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈనెల 11 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని వ్యాఖ్యానించింది. ఇప్పటికే విచారణకు రావాలని పేట్ బషీరాబాద్ పోలీసులు అతనికి నోటీసులు జారీ చేశారు.
లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు
పోలీసుల నోటీసును సవాల్ చేస్తూ రాజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో లేని వ్యక్తిని విచారణకు పిలిచే అధికారం పోలీసులకు లేదని పిటిషనర్ వాదించారు. దిల్లీలో ఉన్న తన హాజరు కోసం చట్ట విరుద్ధంగా ఒత్తిడి చేస్తున్నారని రాజు పేర్కొన్నారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పిటిషనర్ అభ్యంతరాలపై ఈనెల 11లోగా వివరణ ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. అప్పటి వరకు రాజు హాజరు కోసం ఒత్తిడి చేయవద్దని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: