ETV Bharat / state

High Court: ‘కేసుల వివరాల కోసం వినతిపత్రం ఎందుకివ్వాలి’ - తెలంగాణ హైకోర్టు

పాత్రికేయుడు రఘుపై నమోదైన కేసుల వివరాల కోసం వినతి పత్రం ఇవ్వాల్సిన అవసరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. రఘు భార్య పిటిషన్​పై విచారణ జరగ్గా... కేసుల వివరాలు సమర్పించాలని డీజీపీని ఈ మేరకు హైకోర్టు ఆదేశించింది.

high court give orders to dgp to submit journalist raghu's cases details
‘కేసుల వివరాల కోసం వినతిపత్రం ఎందుకివ్వాలి’
author img

By

Published : Jun 9, 2021, 5:51 PM IST

జర్నలిస్టు రఘుపై నమోదైన కేసుల వివరాలను సమర్పించాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. రఘు భార్య లక్ష్మీ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 14లోగా కేసుల వివరాలు సమర్పించాలని డీజీపీకి హైకోర్టు స్పష్టం చేసింది. రఘు బెయిల్ పిటిషన్ రేపు విచారణ ఉన్నందున కేసుల వివరాలు ఇవ్వాలని పిటిషనర్ లక్ష్మీ.. ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది.

కేసుల వివరాల కోసం డీజీపీకి వినతిపత్రం ఇవ్వాల్సిన అవసరమేంటని హైకోర్టు ప్రశ్నించింది. డీజీపీకి వినతిపత్రం ఇవ్వాలని ఒత్తిడి చేయకుండా కేసుల వివరాలు ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: Vaccination: పిల్లలకు అన్ని టీకాలు వేయాల్సిందే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.