సీజనల్ పండ్ల అమ్మకాల కోసం ప్రత్యేక సంతలు ఏర్పాటు చేయాలని నిర్మల్‌కు చెందిన విశ్రాంత పశువైద్యుడు కే నారాయణ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బీ విజయసేన్ రెడ్డి ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. లాక్డౌన్ వల్ల సీజనల్ పండ్ల వ్యాపారులు నష్టపోతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సీజనల్ విక్రయాల కోసం ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేయాలని కోరారు. లాక్డౌన్ ఉన్నప్పటికీ పండ్లు అమ్ముకునేందుకు అనుమతి ఉందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. వాదనలు విన్న హైకోర్టు... లాక్డౌన్ వేళ సీజనల్ పండ్ల అమ్మకాల కోసం రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల వారీగా ఎలాంటి మంచి ఏర్పాట్లు చేయగలరో ఈ నెల 13 లోగా తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇవీ చూడండి: మందుబాబులను చితకబాదిన మహిళ