ETV Bharat / state

ఎల్బీనగర్‌లో హైటెక్‌ రోడ్లు... అత్యాధునిక హంగులతో నిర్మాణం - Telangana news

హైదరాబాద్​లో ఎక్కడా లేని విధంగా, అత్యాధునిక హంగులతో ఎల్బీనగర్‌లో హైటెక్‌ రోడ్లు రాబోతున్నాయి. రూ.60 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకున్న ప్రాజెక్టు ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తుండగా.. రూ.3.5కోట్లతో కూడిన ప్రయోగాత్మక ప్రాజెక్టును అధికారులు ఇప్పటికే పట్టాలెక్కించారు.

ఎల్బీనగర్‌లో హైటెక్‌ రోడ్లు... అత్యాధునిక హంగులతో నిర్మాణం

author img

By

Published : Jan 4, 2021, 8:49 AM IST

ఎల్బీనగర్‌లో హైటెక్‌ రోడ్లు రాబోతున్నాయి. నగరంలో ఎక్కడా లేని విధంగా, అత్యాధునిక హంగులతో రహదారులు రూపుదిద్దుకుంటున్నాయి. రూ.60 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకున్న ప్రాజెక్టు ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తుండగా.. రూ.3.5కోట్లతో కూడిన ప్రయోగాత్మక ప్రాజెక్టును అధికారులు ఇప్పటికే పట్టాలెక్కించారు.

ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏంటంటే.. విదేశాల్లో మాదిరి రోడ్లు అందంగా, ఆకర్షణీయంగా నిర్మాణమవుతాయి. ఇరువైపులా సైకిల్‌ ట్రాక్‌, సర్వీసు రోడ్లు, విశాలమైన కాలిబాటలు, వాటిపై సేదతీరే గదులు, పార్కులు, పాదచారులకు కుర్చీలు, ఆకర్షణీయమైన బస్‌ షెల్టర్లు ఉంటాయి. కూడలి నుంచి చింతలకుంట చెక్‌పోస్టు వరకు నడుస్తోన్న ప్రయోగాత్మక ప్రాజక్టు పనులు రెండు వారాల్లో పూర్తవుతాయని యంత్రాంగం స్పష్టం చేస్తోంది.

ఆదర్శంగా ఉండేట్లు..

పర్యాటకంగా నగరం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో హైటెక్‌ రోడ్లను సాకారం చేసి చూపేందుకు ఎల్బీనగర్‌ జోన్‌ అధికారులు నమూనా ప్రాజెక్టు కోసం ఎల్బీనగర్‌ కూడలి నుంచి చింతల కుంట చెక్‌పోస్టు వరకు ఉన్న రోడ్డును ఎంచుకున్నారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రోడ్డు స్థలాన్ని వృథా కానివ్వకుండా, కబ్జాలకు గురికాకుండా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. రెండు వైపులా కలిపి నాలుగు కాలిబాటలు వస్తాయి. వాటి మధ్యలో సర్వీసు రోడ్లు, ప్రధాన రోడ్డు ఉంటుంది. బస్సులకు ప్రత్యేక లైను, బస్టాపులకు ఆనుకుని ఉండే కాలిబాట పక్కన రెండు వైపులా సైకిల్‌ ట్రాక్‌ రానుంది. మధ్యలో అటు, ఇటు కలిపి 8 లైన్ల రోడ్డు మార్గం ఉంటుంది. వాహనాలు రోడ్లపై ఆగకుండా సాఫీగా పోయేలా దారులను అభివృద్ధి చేస్తున్నాం.’’

-- జోన్ ఉన్నతాధికారి

ప్రపంచస్థాయి దారులు సాకారం!

ఐటీ కంపెనీలకు నిలయమైన హైటెక్‌సిటీలోనూ కనిపించని విధంగా ఎల్బీనగర్‌ చుట్టూ ఉన్న ప్రధాన రోడ్డు మార్గాలను 200 మీటర్ల మేర పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నామని జోనల్‌ అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు నగరానికి తలమానికం కానుందని అధికారులు వివరించారు. ఎస్సార్డీపీ కింద ఎల్బీనగర్‌ కూడలి, బైరామల్‌గూడ కూడలి, నాగోల్‌ కూడళ్లలో పైవంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణం జరుగుతుందని, వాటితోపాటు హైటెక్‌ రోడ్ల ప్రాజెక్టును చేపట్టి ప్రపంచస్థాయి దారులను సాకారం చేసి చూపిస్తామని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రయోగాత్మక ప్రాజెక్టు ఇలా..

వ్యయం రూ.3.5 కోట్లు

రోడ్డు వెడల్పు 200 మీటర్లు

అభివృద్ధి చేయనున్న రోడ్డు పొడవు 0.5కి.మీ

ప్రధాన ప్రాజెక్టు ఇలా..

వ్యయం.. రూ.60కోట్లు

మూడు భాగాలుగా..

1) ఇన్నర్‌ రింగు రోడ్డుపై ఉండే ఒవైసీ ఆస్పత్రి కూడలి నుంచి ఎల్బీనగర్‌ కూడలి వరకు

2) ఎల్బీనగర్‌ కూడలి నుంచి నాగోల్‌ మూసీ నది వరకు

3) ఎల్బీనగర్‌ కూడలి నుంచి హయత్‌నగర్‌ వరకు

ఇదీ చూడండి: దట్టంగా పొగమంచు.. జాగ్రత్తలతో అధిగమించు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.