కరోనా నివారణలో భాగంగా తనవంతు సాయంగా రాష్ట్రానికి యువ కథానాయకుడు నితిన్ రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇవాళ నితిన్ కలిశారు. సీఎం సహాయనిధి కోసం చెక్కు అందజేశారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్.. నితిన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి కూడా నితిన్ మరో రూ. 10 లక్షలు విరాళాన్ని ప్రకటించారు.
ఇవీ చూడండి: 'ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం.. కరోనాను కట్టడి చేద్దాం'