శ్రీశైలం జలాశయానికి భారీగా వరద చేరుతోంది. అధికారులు జలాశయం 7 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయం ఇన్ఫ్లో 1,11,801 క్యూసెక్కులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 884.50 అడుగులకు చేరింది. జలాశయంలో 212.9198 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేసి అదనంగా 30,658 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'శ్రీశైలం విద్యుత్కేంద్రాన్ని పూర్తిగా ఆధునికీకరిస్తేనే మేలు'