కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీకి ఇన్ ఫ్లో 6,73,283 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 6,67,842 క్యూసెక్కులుగా ఉంది. కాలువల ద్వారా 5,441 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
వరద తీవ్రత దృష్ట్యా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కరకట్ట వద్ద ఉన్న చిగురు బాలల ఆశ్రమానికి వరద పోటెత్తింది. అందులో ఉన్న 72 మంది బాలలను విజయవాడలోని గుణదలకు తరలించారు. మహానాడులోని లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాలని ప్రజలకు అధికారులు సూచనలు చేశారు.
ఇవీచూడండి: ఇంటి నుంచే చైతన్య కార్యక్రమాలు... యూట్యూబ్ ఛానళ్లతో ప్రచారం..