ETV Bharat / state

Godavari River: గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద డేంజర్ బెల్స్‌

Godavari River: గోదావరికి వస్తున్న వరద కలవరానికి గురి చేస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి, ఉపనదుల్లోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. వీలైనంత ఎక్కువ నీటిని దిగువకు వదులుతున్నందున లోతట్టు, దిగువ ప్రాంతాలకు ముప్పు తప్పడం లేదు. ప్రాజెక్టులు జలకళ సంతరించుకుని నిండుకుండను తలపిస్తున్నాయి.

గోదావరి
గోదావరి
author img

By

Published : Jul 14, 2022, 9:59 AM IST

Updated : Jul 14, 2022, 11:50 AM IST

గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Godavari River: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలతో ప్రవాహ ఉద్ధృతి మరింత పెరిగింది. చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మూడు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే సామర్థ్యం గల కడెం ప్రాజెక్టులోకి బుధవారం తెల్లవారుజాము నుంచే అయిదు లక్షల క్యూసెక్కుల వరద వెల్లువలా వచ్చి చేరింది. ఎల్లంపల్లికి కూడా భారీ వరద వచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మించాక ఇంత వరద రావడం ఇదే మొదటిసారి. 19 లక్షల క్యూసెక్కుల వరద వెళ్లేలా డిజైన్‌ చేయగా, 12 లక్షల క్యూసెక్కులకుపైగా వచ్చింది.

మూడో ప్రమాద హెచ్చరిక: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. గోదావరిలో నీటిమట్టం ప్రస్తుతం 59.90 అడుగులకు చేరింది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. గోదావరి నదిలో ప్రస్తుతం 17.92 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.

శ్రీరామసాగర్, కడెం నుంచి విడుదల చేసిన నీటితోపాటు ఎల్లంపల్లి క్యాచ్‌మెంట్‌ ఏరియాలో కురిసిన భారీ వర్షాలతో ఈ ప్రాజెక్టుకు మరింత వరద వచ్చింది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. బుధవారం పలు చోట్ల భారీ వర్షాలు పడటంతో సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలకు రికార్డుస్థాయిలో వరద పోటెత్తింది. ఈ బ్యారేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత ఇదే అత్యధికం. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు క్రమేణా వరద తీవ్రత పెరుగుతూనే ఉంది.

శ్రీరామసాగర్ ప్రాజెక్టు: శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి నాలుగు లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో వస్తుండగా.. నాలుగున్నర లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. నీటినిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు. గతంలో ఈ ప్రాజెక్టుకు అత్యధికంగా వచ్చిన ప్రవాహం.. 11.08 లక్షల క్యూసెక్కులు. వరద పెరిగితే ఇంకా ఎక్కువ మొత్తాన్ని దిగువకు వదలనున్నారు. ఈ మేరకు లోతట్టు ప్రాంతాలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తున్నారు.

ఎల్లంపల్లి నీటి నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు. నీటి విడుదల సామర్థ్యం 19.75 లక్షల క్యూసెక్కులు. బుధవారం ఈ ప్రాజెక్టు నుంచి 12.03లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి నిర్మాణం తర్వాత గతంలో గరిష్ఠంగా 8.83 లక్షల క్యూసెక్కులు రాగా.. నిన్న వచ్చిన వరదే అత్యధికం.

సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులు: సుందిళ్ల పూర్తి స్థాయి నీటి మట్టం 130 మీటర్లు. నీటి నిల్వ సామర్థ్యం 8.83 టీఎంసీలు. గేట్ల సంఖ్య 74. నీటి విడుదల సామర్థ్యం 20.12 లక్షల క్యూసెక్కులు. నిన్న 11.95లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యారేజీ నిర్మాణం తర్వాత ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు. సుందిళ్లలో పంపుహౌస్‌ నీట మునగకుండా కాపాడటానికి ఇంజినీర్లు ఉదయం నుంచే అనేక చర్యలు తీసుకున్నారు.

అన్నారం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 119 మీటర్లు. నీటినిల్వ సామర్థ్య 10.87 టీఎంసీలు. గేట్ల సంఖ్య 66. నీటి విడుదల సామర్థ్యం 21.8లక్షల క్యూసెక్కులు కాగా.. నిన్న 12.43 లక్షల క్యూసెక్కుల విడుదల చేశారు. మానేరు నుంచి వచ్చే 80వేల క్యూసెక్కులతో కలిపి, బ్యారేజీ నిర్మాణం తర్వాత ఇదే అత్యధికం.

మేడిగడ్డ ప్రాజెక్టు: మేడిగడ్డ లక్ష్మీ ఆనకట్ట వద్ద నీటిమట్టం 25 ఏళ్ల కాలంలో మొదటిసారి వంద మీటర్లకు చేరుకొంది. బ్యారేజీ పూర్తి స్థాయి నీటి మట్టం వంద మీటర్లే. 17లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో ఉండగా.. అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 16.47 టీఎంసీలు. గేట్ల సంఖ్య 85. నీటి విడుదల సామర్థ్యం 28.25 లక్షల క్యూసెక్కులు. నిన్న 15.48 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యారేజీ నిర్మాణం తర్వాత ఇదే అత్యధికం. 1986 ఆగస్టులో అత్యధికంగా 28 లక్షల క్యూసెక్కుల వరద నమోదైనట్లు కేంద్ర జలసంఘం సమాచారం.

Last Updated : Jul 14, 2022, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.